కోర్టు తీర్పులను అమలు చేయకపోవడం అన్నది ఇటీవలి కాలంలో ప్రభుత్వాలకు మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. గిరిజన ప్రాంతాలలో ఉపాధ్యాయ పోస్టుల రిజర్వేషన్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకూ సుప్రీం కోర్టు గతంలో జరిమానా విధించింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ సర్కార్ జరిమానా చెల్లించలేదు. దీనిపై దేశ సర్వోన్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజన ప్రాంతాలలో టీచర్ల నియామకం విషయంలో వందశాతంఎస్టీ రిజర్వేషన్లు కల్పిస్తూ గతంలో ఉభయ తెలుగు రాష్ట్రాలూ తీసుకున్న నిర్ణయాన్నిఅప్పట్లోనే సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రెండున్నర లక్షల చొప్పున జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జరిమానా మొత్తాన్ని రెండు వారాల్లోగా చెల్లించాలనీ ఆదేశించింది.
అయితే తెలంగాణ సర్కార్ ఆ ఆదేశాన్ని అమలు చేయలేదు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బోస్ లతో కూడిన ధర్మాసనం ఈ రోజు (మంగళవారం) ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిమానా చెల్లించకుంటే కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనన్న తమ ఆదేశాలను ఖాతరు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.
అయితే సుప్రీం తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసిందనీ, అది పెండింగ్ లో ఉన్నందున చెల్లించలేదనీ తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. దీంతో మంగళవారం నుంచి రెండు వారాల్లోగా జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. గిరిజన ప్రాంతాలు సహా అన్ని ప్రాంతాలలోనూ రిజర్వేషన్లు రాజ్యాంగానికి లోబడే ఉండాలని గతంలోనే ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం విస్పష్ట తీర్పు ఇచ్చిన సంగతి విదితమే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-fires-on-telangana-government-25-137221.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.