నడ్డా నోట బాబు మాట.. దేనికి సంకేతం!

Publish Date:Jun 7, 2022

Advertisement

బీజేపీ స్వరం మారిందా? రాష్ట్రంలో పొత్తుల గురించి పల్లెత్తు మాట మాట్లాడినా సహించబోమని ఏపీ బీజేపీ నాయకులను
హెచ్చరించిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం రాజమహేంద్రవరంలో జరిగిన గోదావరి గర్జన సభలో క్విట్
వైసీపీ నినాదం ఇచ్చారు.   రాష్ట్రంలో జగన్ సర్కార్ ను సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారంటూ ఎలుగెత్తారు. తెలుగుదేశం మహానాడులోనూ, అంతకు ముందు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జిల్లాల పర్యటనల్లొనూ ఇదే చెప్పారు. నడ్డా కూడా సరిగ్గా ఇదే చెప్పారు.

అయితే ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ప్రసంగించారు కనుక రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటూ ముక్తాయించారు అది వేరే విషయం. రాజమహేంద్రవరంలో జరిగిన బీజేపీ గోదావరి గర్జన సభ వేదికగా ఆయన వైసీపీ ఆర్థిక క్రమశిక్షరా రాహిత్యం గురించి, కరెంటు కష్టాలు, పన్నులు, అప్పులు ఇలా ప్రతి అంశంలోనూ ఆయన విమర్శలు చంద్రబాబు వైసీపీపై చేస్తున్న విమర్శలను పోలి ఉన్నాయి. వైసీపీ సర్కార్ రాష్ట్రంలో విపక్షాలను తిరగనీయడం లేదనీ, మాట్లాడనీయడం లేదనీ నడ్డా చేసిన వ్యాఖ్యలు, జగన్ ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురి చేయడంపైనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఎందుకంటే ఏపీలో బీజేపీ జగన్ ప్రభుత్వంపై ఇప్పటి వరకూ పోరాడింది లేదు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసిందీ లేదు. వైసీపీ ప్రభుత్వం బీజేపీ నేతలను, కార్యకర్తలనూ వేధించిందీ లేదు. ఇంత వరకూ వైసీపీ, బీజేపీల మధ్య ఉన్నది స్నేహపూర్వక వైరుధ్యమేనని విశ్లేషకులు వివరాలతో సహా వివరిస్తున్నారు. దీంతో నడ్డా రాష్ట్రంలో పొత్తలపై ఎవరూ నోరెత్తదని హెచ్చరించడం, పురంధేశ్వరి వంటి బీజేపీ నేతలు గతంలోనే పొత్తులపై నిర్ణయం తీసుకునేది పార్టీ అగ్రనాయకత్వం కానీ, ఇక్కడి నేతలకు కాదని సోము వీర్రాజు వంటి వారికి ఝలక్ ఇచ్చేలా ప్రకటనలు చేయడం గమనిస్తే.. బీజేపీ స్వరం మార్చుకుంటోందనీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అడుగు వేస్తోందని అవగతమౌతోందని రాజకీయ వర్గాలలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. ఇక బీజేపీ గోదావరి గర్జనకు హాజరైన జనం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే బీజేపీకి అంత మంచింది. ప్రతిష్ఠాత్మకం అంటూ ఆ పార్టీ ఎంతో ఆర్భాటం చేసి నిర్వహించిన రాజమహేంద్రవరం సభ జనం లేక వెలవెల పోయింది.

ఆ సభకు వచ్చిన జనాన్ని చూడగానే నడ్డాగారికి రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమిటన్నది అర్ధమైపోయి ఉంటుంది. బీజేపీ రాష్ట్ర నాయకుడి సత్తా, జనంలో, పార్టీలో ఆయనకు ఉన్న పలుకుబడి తేటతెల్లమై పోయి ఉంటుంది. వైసీపీతో అంటకాగితే, బీజేపీకి రాష్ట్రంలో ఉన్న నామమాత్రపు ఉనికి కూడా మాయం కావడం ఖాయమని తేలిపోయి ఉంటుంది. అందుకే గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఆయన వైసీపీపై విమర్శలు సంధించారు. ఏదో మాటవరసకు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం అన్న మాట అన్నప్పటికీ..  రాష్ట్ర సర్కార్ ను ఆయన విమర్శించడానికి రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షం జనసేనను ఆదర్శంగా తీసుకోలేదు. విపక్షం తెలుగుదేశం జగన్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, ఆర్థిక అధోగతిని ఎత్తి చూపుతూ వెల్లడించిన గణాంకాలనే ప్రామాణికంగా తీసుకున్నారు. అందుకే నడ్డా ప్రసంగమంతా చంద్రబాబు జగన్ సర్కార్ పై చేసిన విమర్శలను మళ్లీ తన నోట వినిపించడానికే పరిమితమైంది.

 రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని నడ్డా విమర్శించారు. అంత అడ్డగోలుగా అప్పులు చేయడానికి అనుమతించినది కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ ప్రభుత్వమేనని కన్వీనియెంట్ గా మరచిపోయారు.   అన్ని రాష్ట్రాల్లో మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తుంటే... ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగు భాషకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇంగ్లీషు మీడియం బడులు అంటూ జగన్ ఆర్భాటంగా ప్రకటన చేసిన సందర్భంగా తెలుగు సంగతేమిటంటూ తొలుత నిలదీసింది తెలుగుదేశం అధినేత చంద్రబాబే.

జగన్ ఆంగ్ల మీడియం ప్రకటనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇంత వరకూ ఒక్క మాట కూడా అనలేదు. ఇక జగన్ హయాంలో అవినీతి, ఇసుక, ల్యాండ్‌, మద్యం మాఫియాల గురించి విమర్శలు, ఆందోళనలకు రాష్ట్రంలో నాయకత్వం వహించింది తెలుగుదేశమేనన్న సంగతి తెలిసిందే. సొంతంగా రాష్ట్రానికి ఇది చేశాం అని చెప్పుకోవడానికి ఏమీ లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో జగన్ సర్కార్ అవినీతి, దుర్మార్గాలపై గట్టిగా నిలదీస్తున్న తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడానికి నడ్డా జంకారన్నది పరిశీలకులు, ప్రజలు సైతం బాహాటంగానే చెబుతున్నారు. ఇంత కాలం రాష్ట్రంలో బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు కారణంగానే జాతీయ నేత వచ్చినా బీజేపీ గోదావరి గర్జన సభకు జనం కరవయ్యారని అంటున్నారు.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.