జగన్‌ను అరెస్టు చేస్తే కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమా!?
Publish Date:Jan 9, 2012
Advertisement
హైదరాబాద్: "జగతి"లో పెట్టుబడులకు సంబంధించి ఒక్క తప్పు కూడా జరగలేదనీ, సీబీఐ అక్రమంగా అరెస్టులు చేస్తోందని జగన్ వాదిస్తున్నారు.ఈ వాదనలు సంగతి ఎలా ఉన్నా అక్రమాస్తుల కేసులో నిందితుడుగా ఉన్న నెం.1ని వదిలేసి నెం.2ను అరెస్టు చేయడంపైనే ఇపుడు చాలామంది మాట్లాడుకుంటున్నారు. దీనికి వారు పలు ఆసక్తికర వాదనలు సైతం తీసుకవస్తున్నారు.కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు కీలక విషయాలకు సంబంధించిన వ్యవహారాలు జగన్ గుప్పెట్లో ఉన్నాయనీ, అవి బయటకు తీస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయనీ, అందువల్ల జగన్ అరెస్టు అంటే జగన్ కంటే కాంగ్రెస్ పార్టీయే తెగ వణికిపోతుందని అంటున్నారు.ఇప్పటికే ఒకవేళ తన తండ్రి ఏదైనా అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే, దానికంతటికీ మొత్తం కేబినెట్ మంత్రులందరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని పలుమార్లు ఇప్పటికే జగన్ స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో సీబీఐ జగన్‌ను అరెస్టు చేస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశముందని అనుకుంటున్నారు.
మరోవైపు జగన్ కంపెనీలకు, అంతకుముందు వైఎస్సార్ కుటుంబానికి ఆడిటర్‌గా ఉంటూ వారికి అత్యంత సన్నిహితుడుగా, కీలకమైన వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డిని ముందు అరెస్టు చేసి ఆ తర్వాత ఆయన చెప్పే విషయాల ఆధారంగా జగన్‌ను అరెస్టు చేయాలన్నది సిబిఐ ఉద్దేశం అని అంటున్నారు. అయితే జగన్‌ను వ్యక్తిగతంగా ఈ కేసులో ఇంతవరకు ప్రశ్నించలేదు.దీనికి కారణం జగన్ ఎన్నడూ అధికారంలో లేకపోవడమే. అయితే తండ్రి సంపాదించిన డబ్బును అనుభవిస్తున్నారు కనుక ఆ తప్పు తండ్రిదా? అయితే ఈ కేసులో వైఎస్సార్ పాత్ర ఉంటే కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంటుందా అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడం ఖాయం.. ఏం జరుగుతుందో చూద్దాం.
http://www.teluguone.com/news/content/jagan-24-10779.html





