జగన్ ను అరెస్ట్ చేసే ఛాన్స్..విజయమ్మకు పార్టీ పగ్గాలు ?
Publish Date:Jan 3, 2012
Advertisement
హైదరాబాద్: జగన్ను జనవరిలోనే సిబిఐ అరెస్టు చేసే అవకాశాలున్నాయని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగతి పబ్లికేషన్స్ ఖాతాలను స్తంభింపజేసే అవకాశాలున్నాయని ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. అదే జరిగితే వైయస్ విజయమ్మ పార్టీ పగ్గాలను తన చేతిలోకి తీసుకుని ఓదార్పు యాత్ర చేపట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్ కృష్ణా జిల్లా మైలవరం కుల్తీ సారా బాధితులను పరామర్శించనున్నారు. ఆ తర్వాత ఫీజు రీయంబర్స్మెంట్ను విడుదల చేయాలని కోరుతూ ఆయన జనవరి 4వ తేదీన ఒంగోలులో జరిగే ధర్నాలో పాల్గొంటారు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో తన ఓదార్పు యాత్రను కొనసాగిస్తారు. జగన్ అరెస్టు జరిగితే వైయస్ విజయమ్మ ఓదార్పు యాత్రను చేపడతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ఒకరు తమతో చెప్పినట్లు ఆ పత్రిక రాసింది.జగన్ అరెస్టు జరిగితే పార్టీకి మేలే జరుగుతుందనే అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతున్నట్లు ఆ పత్రిక రాసింది. జగన్ కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారనే ప్రచారానికి దాంతో తెర పడుతుందని అంటున్నారు.
కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాలు తమకేమీ నష్టం కలిగించవని కాంగ్రెసు పార్టీ వర్గాలంటున్నాయి. ఎన్నికలకు రెండున్నరేళ్లు ఉన్నాయని, అప్పటికి జగన్ ప్రభావం పూర్తిగా తగ్గుతుందని ఆ వర్గాలు దీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాలు తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీపై, తెలంగాణలో జగన్ ఓదార్పు యాత్రపై మల్లగుల్లాలు పడుతున్నాయి.
http://www.teluguone.com/news/content/jagan-24-10543.html





