వైయస్ జగన్ కొత్త కేబినెట్‌లో గుంటూరు జిల్లా చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజినీకి బర్త్ కన్‌ఫార్మ్ అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో టాక్ నడుస్తోంది. అదే జిల్లాకు చెందిన హోం మంత్రి సుచరిత పదవి పోయి.. అది విడదల వారిని వరించనుందని తెలుస్తోంది. రజినీ బీసీ మహిళ.. ఫారెన్ రిటర్న్.. యూఎస్‌లో ఉద్యోగమే కాదు.. వ్యాపారం చేసి.. ఆ తర్వాత స్వస్థలం చిలకలూరిపేటకు తిరిగి వచ్చి.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తనకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపైనే పోటీ చేసి.. గెలిచి.. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టి.. జగన్ దగ్గర క్రెడిట్ కొట్టేశారు. అప్పుడే ఆమెకు మినిస్టర్ పోస్ట్ వస్తుందని అన్నారు. కానీ రాలేదు. ఈసారి పక్కా అంటున్నారు.
మరోవైపు విడదల రజినీ బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో ఆమెకు ఐటీ శాఖ అప్పటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు చేపట్టిన గౌతమ్ రెడ్డి.. ఇటీవల ఆకస్మిక మృతి చెందారు. ఈ నేపథ్యంలో రజినీకి ఐటీతోపాటు పరిశ్రమల శాఖను కూడా అప్పగిస్తారని తెలుస్తోంది. విడదల రజినీకి ఇంగ్లీషు భాషపై మంచి పట్టు.. అంతకు మించి.. మంచి వాగ్ధాటి.. ఆమె మంత్రి పదవి చేపట్టేందుకు అదనపు అర్హతలు అనే ఓ చర్చ కూడా తాజా తాజాగా నడుస్తోంది. మరోవైపు.. ప్రతిపక్ష టీడీపీకి బీసీ వర్గమే వెన్నుముక. ఆ వర్గం వారి ఓట్లే.. సైకిల్ పార్టీకి అత్యంత కీలకం. దాంతో సదరు వర్గం వారికి కీలక శాఖలు కట్టబెట్టడం ద్వారా.. వారి ఓట్లను ఫ్యాన్ పార్టీ వైపు మళ్లించుకోవాలనే ఓ ఆలోచనతో సీఎం జగన్ ముందు చూపుతో వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. వచ్చేది ఎన్నికల సమయం.. ఈ నేపథ్యంలో ఆచీ తూచీ అడుగులు వేయాలి. అలా అయితేనే.. మళ్లీ ఎన్నికల్లో నెగ్గగలం.. ఆ క్రమంలోనే సీఎం జగన్ .. మలి మంత్రి వర్గ కూర్పు చేశారని ఓ చర్చ అయితే తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా నడుస్తోంది.
2014 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీ తరఫున పని చేసేందుకు యూఎస్ నుంచి కొంత మంది ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేశారు. వారిలో విడదల రజినీ కూడా ఉన్నారు. అలాగే విశాఖ వేదికగా జరిగిన టీడీపీ మహానాడు వేదికపై నుంచి రజినీ మాట్లాడి.. సైకిల్ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడ్డారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆమెకు స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు రాజకీయాల్లో ఓనమాలు నేర్పారు. అలా 2019 ఎన్నికల వేళ.. చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయాలని విడదల రజినీ భావించారు. కానీ పత్తిపాటి పుల్లారావుకు సీట్ కన్‌ఫార్మ్ అని టీడీపీ అగ్రనాయకత్వం చెప్పడంతో.. ఆమె ఫ్యాన్ పార్టీలో ఇలా చేరి.. ఆలా ఎమ్మెల్యే అయ్యారు. అయితే విడుదల రజినీకి సీఎం జగన్ ఆశీస్సులు పుష్కలంగానే ఉన్నాయట. ఆ క్రమంలో ఆమెకు కేబినెట్‌లో బర్త్ కన్‌ఫార్మ్ అని తెలుస్తోంది.
మరోవైపు.. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో.. ఆయన భార్య శ్రీకీర్తిని కూడా కేబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆమెకు అత్యంత కీలక మంత్రి పదవి కట్టబెడతారని సమాచారం. అలాంటి వేళ.. జగన్ కేబినెట్‌లో వీరిద్దరు మాత్రం కన్‌ఫార్మ్ అని ఓ చర్చ అయితే మస్త్ మస్త్‌గా నడుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-vidadala-rajini-as-it-minister-25-133788.html
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.