మంత్రుల మాటలకు అర్థాలే వేరులే!.. జ‌గ‌న్‌పై కాకరేపే కామెంట్స్..

Publish Date:Apr 1, 2022

Advertisement

ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, అనేది ఒకప్పటి మాట. ఇపుడు ఏపీలో మంత్రుల మాటలకు అర్థాలు వేరులే అనుకోవలసి వస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు చేసిన నేపధ్యంలో, మరో పదిరోజుల్లో మాజీలు కాబోతున్న మంత్రులు ఓ వంక ముఖ్యమంత్రికి, పార్టీకి విధేయత ప్రకటిస్తూనే మరోవంక మర్మగర్భంగా అక్కసు వెళ్ళగక్కుతున్నారు.

ముఖ్యంగా ముఖ్యమంత్రి తమ మనసులో ఏముందో  స్పష్టత ఇవ్వకుండా, ఉహాగానాలకు అవకాశం ఇవ్వడంతో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు తమ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉందని సీనియర్ మంత్రులు చికాకు పడుతున్నారు. మంత్రి వర్గంలో కొందరిని కొనసాగించి, కొందరికి ఉద్వాసన పలికితే, ఉద్వాసనకు గురైనవారిఫై అసమర్థులనే ముద్ర పడుతుందని కొందరు సీనియర్ మంత్రులు చిర్రుబుర్రు లాడుతున్నారు. సహజంగా ముఖ్యమంత్రి తమకున్నవిశిష్ఠ అధికారాలను వినియోగించి సమయానుకూలంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేపడతారు. కానీ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ/ప్రక్షాళన పేరిట ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సాగిస్తున్న ప్రహసనం మాత్రం తమకు తలవంపులు తెచ్చేలా ఉందని అంటున్నారు.
 
ఇంతకాలం, జిల్లా రాజకీయాల్లో తమకు ప్రత్యర్ధులుగా ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే, తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మే పరిస్థితి తీసుకురావద్దని, కొందరు మంత్రులు ముఖ్యమంత్రిని కోరినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి,పెద్దిరెడ్డి ‘నన్ను మంత్రి వర్గం నుంచి తీసేస్తే తీసేయండి, కానీ, జిల్లాలో వేరెవరికీ మంత్రి పదవి ఇవ్వొద్దు’ అని మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ కండిషన్ పెట్టారో వేరే చెప్పనక్కరలేదు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి పదవి ఇస్తే, తను జిల్లాలో తలెత్తుకోలేనని, అందుకే ఆయన, నాకు కాకుంటే జిల్లాలో ఇంకెవరికీ, అవకాశం ఇవ్వవద్దనే కండిషన్ పెట్టారని అంటున్నారు. అలాగే, మరో సీనియర్ మంత్రి బోత్స సత్యనరాయణ కూడా, తమ్ముడు తమ్ముడే పేకాటే, అన్నట్లుగా మంత్రి వర్గం నుంచి తనను తప్పించి, సోదరుడు అప్పల నరసయ్యకు స్థానం కలిపిస్తానని చెప్పినా, తనను తొలగించాక.. తన అభిప్రాయంతో మరొకరికి పదవి ఇవ్వడం ఏమిటని ఆయన అంటున్నారు.
 
అదే విధంగా ఇంకొందరు సీనియర్ మంత్రులు, జూనియర్లు కూడా మంత్రి పదవి పోయినందుకంటే, కొత్త జట్టులో తమ ప్రత్యర్ధులకు స్థానం కలిపించడం పట్ల అసహనం వ్యక్త పరుస్తున్నారు. తమ పరిస్థితి మొగుడు కొట్టినందుకు కాదు,తోడి కోడలు నవ్వినందుకు’ అన్నట్లుగా ఉందని వాపోతున్నారు. 

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సన్నిహిత బంధువు, గతంలో మంత్రివర్గ సమూల పక్షాలనను పబ్లిక్’గా సమర్ధించిన ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ‘ఉద్వాసన’పై కుతకుతలాడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తనను తీసేసి,  తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్‌ను కేబినెట్‌లో కొనసాగిస్తే, తన పరువేం కానని, ఆయన వాపోతున్నారు. అదే జరిగితే రాజకీయంగా తనకు ఇబ్బందని బాలినేని భావిస్తున్నారు. జిల్లాలో కొందరిని కొనసాగించి... ఇంకొందరిని తొలగించడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని బాలినేని గట్టిగా చెబుతున్నట్లు సమాచారం.

అదలా ఉంటే, ఉద్వాసన ఖాయమని తెలిసినా, కొందరు మంత్రులు, దింపుడు కళ్ళెం ఆశతో ఇంకా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇటు నుంచి కాకపోతే అటునుంచి నరుక్కురమ్మనే, థియరీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీనియర్ మత్రి బొత్స సత్యనరాయణ, గతాన్ని మరిచి పోయి, పుట్టి పెరిగిన కాంగ్రెస్ పార్టీని కాదని, ఒకప్పుడు తానే తిట్టిపోసిన పిల్ల కాంగ్రెస్ పార్టీ, కన్నతల్లిలాంటిదని చెప్పుకొచ్చారు.అంతే కాదు, ఒకప్పుడు ఇదే జగన్ రెడ్డిపై  అసెంబ్లీ సాక్షిగా అనరాని మాటాలు అని, చేయరాని ఆరోపణలు చేసిన బొత్స ఇప్పడు జగన్ రెడ్డికి వీర విధేయతను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  ఎలాంటి నిర్ణయం తీసుకున్నాసంతోషంగా స్వాగతిస్తామని చెప్పుకొచ్చారు. అంతే కాదు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ మాట చెబితే దానికి కట్టుబడి ఉంటామన్నారు. అయితే ఇంతలోనే  ఇలా విధేయంగా స్పందించిన బొత్స రేపు ముఖ్యమంత్రి అంతరితో పాటు ఆయనకు ఉద్వాసన పలికితే, అప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలని, అంటున్నారు.  

ఈ అన్నిటినీ మించి, మంత్రి కొడాలి నానీ, ఆయన ముఖ్యమంత్రికి విధేయత ప్రకటించారో హెచ్చరిక చేశారో అర్థం కాకుండా చేసిన ప్రకటన, అందరిలోనూ ఆశక్తిని రేకెత్తిస్తోంది. కొడాలి నానీ, ఓ వంక తను బతికున్నంత వరకు జగన్ రెడ్డి చేయి వదలనని, ఆయన తోనే ఉంటానని అన్నారు. అదే క్రమంలో మంత్రి పదవి పోతే విశ్వరూపం చూపుతానని అన్నారు. అంటే మరింతగా బూ... లతో రెచ్చిపోయి, మరింతగా పార్టీ పరువు తీస్తానని, నానీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డినిహెచ్చరించారా? అని వైసీపే నేతలు కొందరు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. 

నిజానికి, ముఖ్యమంత్రి దీనికి ఏ పేరు పెడతారో ఏమో కానీ, ఆయన తలపెట్టిన ఈ ‘క్రతువు’ పార్టీలో చిక్కులు, చికాకులు తెచ్చి పెడుతుందని రాజకీయ విశ్లేశకులు అంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాక తెచ్చుకున్నారని, ఇక ఇప్పుడు ఇటూ అటూ ఎటు వెళ్ళినా రాజకీయంగా చిక్కులు తప్పేలా లేవని అంటున్నారు.అంతే కాదు, ఎంతవరకు నిజమో ఏమో కానీ, తాజా పరిస్థితిపై పీకే బృందం సర్వే చేస్తోందని, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వతానే  ముఖ్యమంత్రి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని, అంతవరకు ఉహాగానాలు వినిపిస్తూనే ఉంటాయని అంటున్నారు.

By
en-us Political News

  
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.