హంగ్ దిశగా యూపీ?.. మోదీ-యోగిల భవిష్యత్ ఏంటి?

Publish Date:Feb 26, 2022

Advertisement

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మెల్లి మెల్లిగా ఆఖరి ఘట్టానికి చేరుకుంటున్నాయి. ఆదివారం 60 అసెంబ్లీ స్థానాల్లో ఐదవ విడత పోలింగ్. మరో మూడు విడతల పోలింగ్ మిగిలుంది. మార్చి 7న జరిగే చివరి ఎనిమిదవ విడత పోలింగ్’తో పోలింగ్ ఘట్టం ముగుస్తుంది. మార్చి 10 తేదీన ఓట్ల లెక్కింపు.. ఫలితాలు. 

అయితే ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో  ఎవరూ ముందస్తు జ్యోస్యం చెప్పే సాహాసం చేయడం లేదు. అయితే, ఇంతవరకు జరిగిన నాలుగు విడతల పోలింగ్ సరళిని బట్టి చూస్తే, 2017 నాటి బీజేపీ ప్రభంజనం పునరావృతం కాదనే విషయంలో మాత్రం  ఇంచుమించుగా ఏకాభిప్రాయమే వ్యక్త మవుతోంది. అంతే కాదు, చివరాఖరుకు, ఇటు బీజేపీ ఆశలు, అటు ఎస్పీ ఆశలు, విశ్లేషకుల అంచానాలు తల్ల కిందులై. బీఎస్పీ అధినేత్రి  మాయావతి ముచ్చట పడుతున్న, ‘హంగ్’ అసెంబ్లీ అనివార్య మవుతుందా అన్న సందేహాలు కూడా యూపీ రాజకీయ వర్గాల్లో  వ్యక్తమవుతున్నాయి.  
ఈ నేపధ్యంలోనే ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీఎస్పీ అధినాయకురాలు మాయావతి ఒకరిపై ఒకరు  చల్లుకున్న ప్రశంసల జల్లులు, అందుకోసమేనా అనే చర్చ మొదలైంది. కీడెంచి మేలేంచే ఉద్దేశంతోనో లేక నిజంగానే, హంగ్ అని వార్యం అనే సమాచారంతోనో అమిత్ షా, ఒక టీవీ ఇంటర్వ్యూలో మాయావతిని పొగడ్తలతో ముంచెత్తారు. మాయావతి క్షేత్ర స్థాయిలో ఎస్సీ, ఎస్టీలలో పట్టుందని, జాతవ్ , ముస్లిం ఓట్లు మాయావతికి పెద్ద సంఖ్యలో వెళ్తాయని కూడా షా చెప్పారు. ఆ వెంటనే మాయావతి వాస్తవాన్ని గుర్తించిన అమిత్ షా’కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా అమిత్ షా, మాయావతి ప్రరస్పరం ఒకరినొకరు మెచ్చుకోవడంతో, అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్’ అసెంబ్లీ అనివార్యం అయితే, ఎందుకైనా మంచిదని అమిత్ షా ముందుగానే ‘కర్చీఫ్’ వేశారనే ప్రచారం మొదలైంది. మరోవంక  బీజేపీకి బీఎస్పీ ‘బీ’ టీమ్‌గానూ మీడియాలో ప్రచారం జరిగింది.ఈ నేపధ్యంలో, బీజేపీతో పొత్తుపై వస్తున్న వార్తలను మాయావతి కొట్టిపారేశారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
 
అయితే మాయావతి మొదటి నుంచి కూడా, చాలా కూల్’ గా, అసలు  బీఎస్పీ ఎన్నికలలో పోటీ చేస్తుందా లేదా అన్న విధంగా పెద్దగా పరుగులు తీయలేదు. అంతే కాకుండా, కింగ్ ఎవరైనా కింగ్ మేకర్ తానేనని, పోటీ చేయకున్నా పవర్’లోకి వస్తామనే ధీమాను వ్యక్త పరిచారు. అంటే, ముందు నుంచి కూడా మాయావతి హంగ్ వస్తుందనే లెక్కల్లోనే ఉన్నారని అనుకోవచ్చును. నిజంగా అదే జరిగితే, మాయావతి బీజేపీ వైపే మొగ్గు చూపుతారని అంటున్నారు. అయితే, ఆమె ముఖ్యమంత్రి అవుతారా, లేక కేంద్రంలో కీలక పదవి కోరుకుంటారా?ఏమవుతుంది,అనేది ఫలితాలు వచ్చిన తర్వాతనే తేలుతుందని అంటున్నారు.
 

By
en-us Political News

  
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.