వివేక హంత‌కులపై కుట్ర జ‌రుగుతోందా? మొద్దు శ్రీనులానే క‌డ‌ప‌ జైల్లో స్కెచ్ వేశారా?

Publish Date:Feb 10, 2022

Advertisement

కడపలోని కేంద్ర కారాగారంలో ఊహించరాని సంఘటన ఏదైనా జరగబోతోందా? గతంలో అనంతపురం జిల్లా జైలులో జరిగిన మాదిరిగానే కడప సెంట్రల్ జైలు కూడా మరో సంచలనానికి వేదికగా మారబోతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కడప సెంట్రల్ జైలు ఇన్ ఛార్జి సూపరింటెండెంట్ గా పోచా వరుణారెడ్డి బాధ్యతలు చేపట్టడమే ఈ అనుమానాలకు అవకాశం ఇస్తోందని అంటున్నారు. గతంలో టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శ్రీను అనంత‌ జిల్లా జైలులో ఉన్నప్పుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ సమయంలో అదే జైలులో ఇన్ చార్జి సూపరింటెండెంట్‌గా పోచా వరుణారెడ్డి ఉన్నారు. అదే వరుణారెడ్డిని ఇప్పుడు కడప సెంట్రల్ జైలుకు ఇన్ చార్జి సూపరింటెండెంట్ గా వైసీపీ సర్కార్ నియమించడంతో అనుమానం రాజుకుంటోంది.

పోచా శ్రీనివాసరెడ్డి కడప సెంట్రల్ జైలు ఇన్ చార్జి సూపరింటెండెంట్ గా ఉంటే ఏదో అనూహ్య సంఘటన ఎందుకు జరుగుతుందనే సందేహం రావచ్చు. ఏపీ సీఎం జగన్ రెడ్డి బాబాయ్, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు దేవిరెడ్డి శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఇప్పుడు కడప సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారు ఉంటే.. ఏమవుతుందని అనుకోవచ్చు. అనంతపురం జిల్లా జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్ గా వరుణారెడ్డి ఉన్నప్పుడు జైలు బ్యారక్ లోనే మొద్దు శీను హత్య జరిగింది. ఆ సమయంలో వరుణారెడ్డిపై పలు ఆరోపణలు వచ్చాయి. మొద్దు శీను హత్యకు పక్కా ప్లాన్ ప్రకారమే జైలులో ఏర్పాట్లు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక పెద్ద తలకాయలే ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి అనుమానాలు వ్యక్తం చేసిన వారిలో వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కూడా ఉన్నారు. తన తండ్రి హత్య కేసులో నిజాలు నిగ్గు తేల్చాలంటూ ఆమె కడప నుంచి ఢిల్లీ స్థాయి వరకూ పోరాడుతూనే ఉన్నారు. న్యాయపోరాటమూ చేస్తున్నారు. వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి నిందితులుగా సీబీఐ పేర్కొని అరెస్ట్ చేసినప్పటికీ వారి వెనక సొంత ఫ్యామిలీలోని ముఖ్యుల హస్తం కూడా ఉండొచ్చనే ఆరోపణలు, అనుమానాలు ఉన్నాయి. వివేకా హత్య కేసులో నిజాలు నిగ్గుతేలి, ప్రధాన సూత్రధారుల బండారాన్ని సీబీఐ త్వరలో బయటపెట్టే అవకాశమూ లేకపోలేదు.

ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసులో నిజాలు ఎప్పటికీ బయటికి రాకుండా చేసే కుట్ర ఏదో జరగబోతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా ఒక సంచలన హత్య జరిగినప్పుడు ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అనూహ్యంగా హతమైపోతున్న సంఘటలు గతం నుంచీ జరుగుతుండడం ఈ అనుమానాలకు తావిస్తోంది.

పరిటాల రవి హత్య కేసు తుది దశకు చేరుకున్న దశలో అప్రూవర్ గా మారుతున్నట్లు మొద్దు శీను అప్పట్లో ప్రకటించాడు. అలా మొద్దు శీను ప్రకటించిన కొద్ది రోజుల్లో అంటే 2008 నవంబర్ 9న హత్యకు గురయ్యాడు. జైలు బ్యారక్ లోనే మొద్దు శీను హత్య జరిగిన తర్వాత పోచా వరుణారెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మొద్దు శీను హత్య కేసులో నిందితుడు ఓం ప్రకాశ్ అప్పట్లో ఆ జైలులోని సరస్వతి 2 బ్యారక్ లో ఉండేవాడు. ఓం ప్రకాశ్ వద్ద డబ్బు ఉందనే అనుమానంతో సరస్వతి 2 బ్యారక్ ను వరుణారెడ్డి సోదా చేశారు. డబ్బు దొరకలేదు. తర్వాత మొద్దు శీను ఉండే యమునా బ్యారక్ లోకి ఓం ప్రకాశ్ ను మార్చారు. అందుకు మొద్దు శీను అభ్యంతరం చెప్పినా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాతే మొద్దు శీను హత్య జరిగింది. మొద్దు శీను బ్యారక్ లోకి ఓంప్రకాశ్ ను వరుణారెడ్డి ఉద్దేశపూర్వకంగానే మార్చారంటూ పరిటాల రవి హత్య కేసులో మరో నిందితుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి అనంతపురం జిల్లా జడ్జికి అప్పట్లో లేఖ రాశాడు. పరిటాల రవి హత్య కేసులో తర్వాత నిర్దోషిగా విడుదలైన పటోళ్ల గోవర్ధన్ రెడ్డి కూడా హైదరాబాద్ నడిబొడ్డున బొగ్గులకుంటలో హత్యకు గురైన విషయం ఇక్కడ ప్రస్తావించదగ్గ అంశం.

మొద్దు శీను హత్య జరిగిన రోజున అనంతపురం జిల్లా జైలు సూపరింటెండెంట్ సెలవులో వెళ్లడం, ఇన్ చార్జి సూపరింటెండెంట్ గా వరుణారెడ్డి వ్యవహరించారు. కడప సెంట్రల్ జైలుకు జైళ్ల శాఖలో సూపరింటెండెంట్ హోదా ఉన్న అధికారిని నియమించాలి. గత సంవత్సరం ఆగస్టు వరకు అదే స్థాయి ఉన్న రవికిరణ్ సూపరింటెండెంట్ గా ఉన్నారు. ఆయనకో ప్రమోషన్ రావడంతో ఇటీవలి వరకూ అదనపు సూపరింటెండెంట్ గన్యా నాయక్ ఇన్ చార్జిగా కొనసాగారు. తాజాగా అదనపు సూపరింటెండెంట్ హోదా ఉన్న వరుణారెడ్డిని కడప సెంట్రల్ జైలు ఇన్ చార్జిగా నియమించడంపై పలువురిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలు వెలుగు చూడకుండా చేసేందుకు పెద్ద స్థాయిలో ఏదో జరగబోతోందా? అందుకు కడప సెంట్రల్ జైలు వేదిక అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.