అమరావతిపై సీఎం జగన్ పంతానికి పోయారు. మాట తప్పి.. మడమ తిప్పి.. రాజధానిని మూడు ముక్కలు చేశారు. నవ్యాంధ్ర నిర్మాతగా చంద్రబాబుకు పాపులారిటీ రాకుండా కుట్ర చేశారంటారు. అలా అలా రెండేళ్లు అమరావతితో ఓ ఆటాడుకున్నారు. రైతులు ఎంతగా ఉద్యమించినా.. ఉక్కుపాదాలతో అణిచేశారే కానీ.. వారి ఆక్రందన విన్నది లేదు.. వారి ఆవేదన తీర్చింది లేదు. అలాంటి జగమొండి జగన్.. ఇటీవల సడెన్‌గా మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నారు. సీఆర్‌డీఏను పునరుద్దరించారు. అదేంటి.. జగన్ ఏంటి.. ఇలా అమరావతిని అలానే ఉంచడమేంటి అని అంతా అనుమానించారు. కానీ, అప్పుడు కారణం తెలియలేదు ఎవరికీ. ఇప్పుడిప్పుడే అమరావతితో పెద్ద స్కెచ్చే వేశారనే అనుమానం బలపడుతోంది. దానివెనుక 'అదానీ' ప్రయోజనం దాగుందని ప్రచారం జరుగుతోంది.
అమరావతి రాజధాని గ్రామాలు ఎన్ని? 29. అంతేగా. మరి, రాజధాని గ్రామాలతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని అనుకుంటే.. అందులో ఎన్ని గ్రామాలు ఉండాలి? 29 గ్రామాలేగా. కానీ, కాదు. అక్కడే ఉందంటున్నారు అసలు కిటుకు. ప్రస్తుతం, ఏపీ ప్రభుత్వం 19 గ్రామాలను ఓ మున్సిపల్ కార్పొరేషన్‌గా.. మరికొన్ని గ్రామాలను మంగళగిరి -తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌గా మారుస్తోంది. ఎందుకిలా చేస్తోందో ఎవరికీ అర్థం కావడం లేదు. సదుద్దేశమే అయితే 29 గ్రామాలను కలిపి ఒకే కార్పొరేషన్ చేయాలిగా? రెండు కార్పొరేషన్లుగా విడగొడుతున్నారంటే.. ఏదో దురుద్దేశం ఉండే ఉంటుందని.. జగన్ గురించి బాగా తెలిసిన అమరావతి రైతులు డౌట్ పడుతున్నారు. అందుకే, ప్రభుత్వ ప్రతిపాదిత కార్పొరేషన్‌ను వ్యతిరేకిస్తూ.. రాజధాని గ్రామాలు ఒక్కోటిగా ఎదురుతిరుగుతున్నాయి. అందుకే అక్కడి ప్రజలు అమరావతి కార్పొరేషన్ ప్రజాభిప్రాయసేకరణలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. 29 గ్రామాలను కలిపి ఒకే కార్పొరేషన్ చేస్తే ఓకే అంటాం కానీ.. ఇలా విడగొట్టాలనే ప్రయత్నాలను మాత్రం గట్టిగా అడ్డుకుంటామని తేల్చి చెబుతున్నారు అమరావతి రైతులు.
అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు వెనుక జగన్ కుట్ర ఇదేనంటూ తాజాగా ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత రాజధాని గ్రామాల్లో.. ఆరు వేల ఎకరాలు అదానీ సంస్థకు తాకట్టు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. పోర్టుల నుంచి కేపిటల్ భూముల వైపు అదానీ కన్నుపడిందని.. అందుకు జగన్ సైతం ఎప్పటిలానే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని చెబుతున్నారు. ఇప్పటికే అదానీ గ్రూపుతో జగన్ ఓ అవగాహనకు వచ్చారని.. అందుకే హడావుడిగా మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారని… అమరావతి కార్పొరేషన్ అంటూ హడావుడి చేస్తున్నారని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ సైతం ఇలాంటి విమర్శలే చేశారు. జరుగుతున్న ప్రచారంలో నిజమే ఉండి ఉంటుందని.. జగన్ నైజం గురించి తెలిసిన వారంతా నమ్ముతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-any-deal-between-jagan-and-adani-on-amaravati-corporation-39-129726.html
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే నేత ఇలంగోవన్ బహిరంగంగానే ఆరోపించారు. తమ మద్దతుతోనే రాజ్యసభ నామినేషన్లు దక్కించుకుని.. కూటమి ద్వారానే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పుడు స్వార్థం రాజకీయంతో వేరే పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దారుణమన్నారు.
దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.