ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి.. మళ్లీ పెచ్చరిల్లిన ఉద్రిక్తతలు

Publish Date:Jun 7, 2026

Advertisement

పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకుమళ్లీ బ్రేక్  పడింది.  అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరాన్, ఇజ్రాయెల్  మధ్య కుదిరిన చారిత్రాత్మక కాల్పుల విరమణ ఒప్పందాన్నిఉల్లంఘిస్తూ..  ఇరాన్ తాజాగా  ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడింది.   ఆదివారం (జూన్ 7) సాయంత్రం ఇజ్రాయెల్  లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది.  దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా  అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం  తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు. అయితే   ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సకాలంలో స్పందించి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను  సమర్థవంతంగా అడ్డుకోవడంతో  ముప్పు తప్పింది.  ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. 

 క్షిపణి దాడులకు కొన్ని గంటల ముందే లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాల్లోని హిజ్బుల్లా సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దళాలు భీకర వైమానిక దాడులు జరిపాయి. ఈ ఘోర వైమానిక దాడుల్లో ఇద్దరు వ్యక్తులు  మరణించగా,  20 మంది  గాయపడ్డారని లెబనాన్ అధికారిక వర్గాలు ధృవీకరించాయి. బీరుట్‌పై గనుక ఇజ్రాయెల్ దాడులకు తెగబడితే తాము చూస్తూ ఊరుకోబోమని..  ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ గతంలోనే తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన సంగతి విదితమే. 

ఈ భారీ క్షిపణి దాడికి తామే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఇరాన్‌కు చెందిన శక్తివంతమైన సైనిక విభాగం  ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్‌జీసీ అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా..  రాబోయే వారం రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగే దాడుల పరంపరకు ఇది కేవలం  ప్రారంభం మాత్రమేనని హెచ్చరించింది.  లెబనాన్‌లో ఇజ్రాయెల్  తన దూకుడు చర్యలను తక్షణమే నిలిపివేయకుంటే..  భవిష్యత్తులో మరింత తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఐఆర్‌జీసీ  వార్నింగ్ ఇచ్చింది.  ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్  స్పందిస్తూ..  ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసిందనీ, ఇందుకు ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని   హెచ్చరించారు.

అన్నట్టుగానే, ఇరాన్ దాడులు జరిగిన  గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రతిదాడులు ప్రారంభించాయి. పశ్చిమ, మధ్య ఇరాన్‌లోని టెహ్రాన్ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్   క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో ఇరాన్‌లోని అనేక నగరాల్లో భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఇరాక్, సిరియా దేశాలు తమ గగనతలాలను తాత్కాలికంగా మూసివేశాయి.  ఇరాన్ సైతం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమైనీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడి, తదుపరి ప్రతీకార దాడులకు స్వస్తి చెప్పి దౌత్య మార్గాల ద్వారా శాంతికి ప్రయత్నించాలని సూచించారు. ఈ తాజా ఉద్రిక్తతల ప్రభావంతో సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

By
en-us Political News

  
ఆస్ట్రేలియా సెన్సస్ 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆగస్టు 11 సెన్సస్ నైట్ తేదీ, నిబంధనలు, AU$364 జరిమానాలు, ఎవరు అర్హులు మరియు హెల్ప్‌లైన్ సమాచారం ఇక్కడ చూడండి.
జంతర్ మంతర్‌లో ఓ న్యాయం.. ఝార్ఖండ్‌లో మరో న్యాయమా..!
లీప్ ఇండియా ఐపీఓ LEAP India IPO బిడ్డింగ్ చివరి రోజు సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, గ్రే మార్కెట్ ప్రీమియం GMP , ఐపీఓ ధర, లిస్టింగ్ తేదీలు మరియు విశ్లేషకుల సబ్‌స్క్రైబ్ రేటింగ్స్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 1.75 లక్షలకు పైగా యూఎస్ వీసాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నేరారోపణలు, బర్త్ టూరిజం, $5 మిలియన్ల ఆర్థిక స్కామ్‌లు మరియు సోషల్ మీడియా పోస్టులే ప్రధాన కారణంగా వీసాల వేటు పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో ఉన్న సంచలనాత్మక లంచం మరియు మోసం కేసును యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు శాశ్వతంగా కొట్టివేసింది. ఈ చారిత్రాత్మక తీర్పుతో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీగా లాభపడ్డాయి. సంపూర్ణ కథనం కోసం చదవండి!
విశాఖపట్నంలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆగస్టు 11న దేశీయంగా బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలతో సహా ప్రధాన నగరాల్లో 24K, 22K మరియు 18K బంగారం లేటెస్ట్ రేట్లు ఎంత పెరిగాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ పునరాగమనం చేయడంపై మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పిన్ ట్రాక్‌లపై ధృవ్ జురెల్ కంటే సర్ఫరాజ్ ఖానే ఎందుకు సరైన ఎంపికో కైఫ్ విశ్లేషించారు.
విదేశాంగ శాఖతో లోకేశ్ సంప్రదింపులు.. మాతృభూమికి రప్పించేందుకు ప్రయత్నాలు.. !
2027 వన్డే ప్రపంచకప్‌నకు వెస్టిండీస్ జట్టు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఐసీసీ ర్యాంకింగ్స్, క్వాలిఫైయర్ సమీకరణాలు, అఫ్గానిస్థాన్ విజయం విండీస్‌పై చూపిన ప్రభావం మరియు 14 జట్ల టోర్నీ అర్హత మార్గం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ బో వెబ్‌స్టర్ కేమరాన్ గ్రీన్‌తో పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన టెస్టు గణాంకాలు మరియు ప్లేయింగ్ ఎలెవన్ విషయమై వెబ్‌స్టర్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.
చార్మినార్ ప్రాంతానికి చెందిన దంపతులకు ఇద్దరు కవల పిల్లలు జన్మించగా ఆరు నెలలకే  కవలలు జన్మించారు.
బ్రేకులు బాగుచేస్తుండగా ముందుకు కదిలిన బస్సు చక్రాల కింద నలిగి మెకానిక్ మృతి..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.