బిజేపీలో బహిర్గతమైన ఈటల, బండి వర్గపోరు!

Publish Date:Jul 19, 2025

Advertisement

తెలంగాణ బీజేపీ అంతర్గత కుమ్యులాటలు, గ్రూపు రాజకీయాల విషయంలో కాంగ్రెస్ తో పోటీ పడుతోందా? అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడి నియామకం తరువాత నుంచి తెలంగాణ బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఆ పార్టీకి హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. ఈటల రాజేందర్ తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు, పరిణామాలూ చూస్తుంటే.. పార్టీ అధిష్ఠానమే రాష్ట్రంలో పార్టీని పతనం దిశగా నడిపిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయన్న చర్చ పార్టీ శ్రేణుల్లోనే నడుస్తోంది. 

తాజాగా ఈటల రాజేందర్ ఓపెన్ అప్ అయిపోయారు. సొంత పార్టీ వాళ్లే తనను వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రాజేందర్  అన్న మాటేమిటి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకాన్ని పార్టీ హైకమాండ్ ప్రకటించిన క్షణం నుంచీ బీజేపీలో ఆసంతృప్తి జ్వాల భగ్గుమంది.  ఆ పదవిని ఆశించిన బీజేపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు మీ గుప్పిస్తున్నారు. రాజాసింగ్ పార్టీ తాజా మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపైనా, ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ పైనా ప్రత్యక్ష, పరోక్ష విమర్శలతో విరుచుకుపడుతున్నారు. 

తాజాగా ఈటల రాజేందర్ తన నివాసంలో నిర్వహించిన బీజేపీ హుజూరాబాద్ కార్యకర్తల సమావేశంలో పేరు ప్రస్తావించకుండా కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో తనను హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఓడించేందుకు సొంత పార్టీ వారే కుట్రలు పన్నారన్నారు. అప్పట్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి అసలు క్యాడరేలేదని గుర్తు చేశారు. వారి ప్రయత్నాలు ఫలించి హుజూరాబాద్ నుంచి అప్పట్లో తాను ఓడిపోయాననీ, అయితే ప్రజల మనస్సులను గెలుచుకుని మల్కాజ్ గిరి ఎంపీగా విజయం సాధించాననీ చెప్పుకొచ్చారు.  తాను ఎన్నడూ వ్యక్తులను నమ్ముకుని, వారిపై ఆధారపడలేదనీ, ప్రజలను నమ్ముకునే ప్రజాజీవితంలో సాగుతున్నానని చెప్పుకున్న ఈటల.. వారిని కూడా తనకు దూరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారనీ, ఇక ఎంత మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.  

త‌న‌పైనా.. త‌న కుటుంబంపైనా సామాజిక మాధ్యమంలో వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నారన్నారు.   తాను ప‌ద‌వుల కోసం  వెంప‌ర్లాడ‌లేనీ, వాటి కోసం పార్టీలు మారలేదనీ చెప్పిన ఈటల గతంలో తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా అప్పటి సీఎం కేసీఆర్ కు తన నిర్ణయాలను నిర్మొహమాటంగా చెప్పానని గుర్తు చేశారు.  పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నిటినీ హై కమాండ్ దృష్టికి తీసుకువెడుతున్నానని ఈటల చెప్పారు. ఈటల ఎక్కడా నేరుగా బండి సంజయ్ పేరు ప్రస్తావించకపోయినా.. ఆయన విమర్శల దాడి నేరుగా బండిపైనేనని అర్ధమౌతూనే ఉంది. ఎందుకంటే ఇటీవల బండి సంజయ్ కూడా ఈటల టార్గెట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలలో తనకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓట్లు పడకుండా కుట్ర జరిగిందని రెండు రోజుల కిందట బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీలో వర్గాలు ఉండవనీ, ఉండేది ఒకే వర్గం, అది మోడీ వర్గమని బండి రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఈటల బదులిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
మాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.