ఇన్‌స్టా లవ్ ట్రాప్ కేటుగాడు కేసులో సంచలన విషయాలు..!

Publish Date:Jul 27, 2026

Advertisement

 

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన "రిచ్ కిడ్స్ ట్రాప్" ఘటన ఇంకా మరవకముందే, అదే తరహాలో సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని మైనర్ బాలికలను ప్రేమ పేరుతో వలలో వేసి మోసాలకు పాల్పడుతున్న మరో యువకుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న ఈ యువకుడిని బంజారా హిల్స్ పోలీసులు చాకచ క్యంగా అరెస్టు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన పవన్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో నివాసం ఉంటున్నాడు. సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే పవన్.. కేవలం మైనర్ బాలికలనే లక్ష్యంగా ఎంచుకుని వారికి ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపేవాడు. కొద్ది రోజుల పరిచయానికే ప్రేమిస్తు న్నానంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి నమ్మకం సంపాదించేవాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానంటూ హామీలు ఇస్తూ వారి భావోద్వేగాలతో ఆడుకునేవాడు. 

చివరకు అత్యవసర అవసరాలు, కుటుంబ ఇబ్బందులు అంటూ నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని పరారవడం అతని నేరశైలి...ఈ క్రమంలోనే బంజారాహిల్స్‌కు చెందిన ఓ మైనర్ బాలిక కూడా పవన్ వలలో చిక్కుకుంది. ప్రేమ పేరుతో ఆమెనుపూర్తి గా నమ్మించి, బంగారు ఆభరణాలు తీసుకుని అదృశ్యమయ్యాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు వెంటనే బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించ డంతో  పవన్ పై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న పవన్ హైదరాబాద్‌ను విడిచి పరారయ్యాడు. దీంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు పవన్ గురించి ఆరా తీయడంతో విస్తు పోయే విషయాలు వెలుగు లోకి వచ్చాయి. 

పవన్‌కు ఫిలింనగర్‌కు చెందిన త్రినాథ్ అనే స్నేహితుడు ఉన్నట్లు గుర్తించారు. గతంలో వీరిద్దరూ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చైన్ స్నాచింగ్, వాహనాల దొంగతనం, మొబైల్ ఫోన్ చోరీ కేసు ల్లోనూ నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు వెంటనే త్రినాథ్ ను విచారణ చేయడంతో జడ్చర్లలో మరో మైనర్ బాలికను వివాహం చేసుకున్న విషయం చెప్పాడు. త్రినాథ్ ఇన్‌స్టా గ్రామ్ ఖాతాను సాంకేతికంగా విశ్లేషించిన పోలీసులు పవన్ ఆచూకీని గుర్తించి జడ్చర్లలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మరో మైనర్ బాలికను కూడా ఇదే తరహాలో మోసం చేసి వివాహం చేసుకున్నట్లు వెల్లడైంది.

దర్యాప్తులో మరో కీలక విషయం కూడా బయటప డింది. పవన్ ఇప్పటికే 2025లో నమోదైన ఓ పోక్సో కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలయ్యాడు. అయినప్పటికీ తన నేరపూరిత ధోరణిని మార్చుకోకుండా మళ్లీ సోషల్ మీడియా వేదికగా మైనర్ బాలికలను టార్గెట్ చేస్తూ ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పవన్ వ్యవహారంలో ఇంకా ఎంతమంది మైనర్ బాలికలు బాధితులుగా ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తును విస్తరించారు. అతని మొబైల్ ఫోన్, ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లు, ఇతర సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్నంగా పరిశీలిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు.. సోషల్ మీడియా లో అపరిచితులతో పరిచయాలు పెంచుకునే విషయంలో యువతులు, ముఖ్యంగా మైనర్ బాలికలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Insta Love Trap, Rich Kids Trap, Karnataka State, Banjara Hills Police, Trinath, Hyderabad police, CP Sajjanar, DGP C.V Anand, CM Revanth redy
 

By
en-us Political News

  
విద్యారంగంలో సంస్కరణలు పూర్తయ్యాయని, ఫలితాలపై దృష్టిపెట్టాలని అధికారులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.
చిన్న జ్వరం వచ్చినా, భుజం నొప్పి పెట్టినా, ఆఖరికి పన్ను బిగించుకోవాలన్నా.. ఏపీ నాయకులు వెంటనే హైదరాబాద్ విమానమెక్కుతారు
హైడ్రా కమిషనర్ పదవి నుండి తొలగించండి హైకోర్టు ప్రభుత్వన్నికి ఆదేశం..! 
సీఎంను కలిసి మూడు రోజులకే గిరిజన విద్యార్థిని సుసైడ్..!
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో ప్రతిపాదిత శ్రీరామ మందిర నిర్మాణానికి ఎదురైన చట్టపరమైన ఆటంకాలు తొలగిపోయాయి.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం పార్లమెంట్‌ను తీవ్రంగా కుదిపేసింది.
నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు... విద్యార్థులపై లాఠీచార్జ్‌ను తప్పుబట్టిన సుప్రీం..!
తల్లి... ఈ ఒక్క పదంలోనే ప్రేమ, త్యాగం, ఆప్యాయత దాగి ఉంటాయి. కానీ అదే తల్లి తీసుకున్న ఒక నిర్ణయం
స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు పోలీసుల గాలింపు..!
బీజేపీ ఎంపీ ఇంట్లో చెలరేగిన పొలిటికల్ రచ్చ..!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు విస్తృతంగా కురు స్తున్నాయి.
అదనపు కట్నం కోసం వేధించి, చంపేందుకు చూశారు.. సంచలన ఫిర్యాదు..!
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా నిర్వహిస్తున్న పోలీసులపై ఓ యువకుడు కారుతోనే దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.