అధికారి టేబుల్‌పై బాదం పప్పులు చల్లిన బాధితుడు!

Publish Date:Apr 20, 2026

Advertisement

 

ఛత్తీస్‌గఢ్‌లో వినూత్న నిరసన: ఫైల్ క్లియరెన్స్ కోసం అధికారిణికి 'బాదం' బహుమతి!

ఫైల్ గుర్తులేదన్న అధికారి.. బాదం పప్పులతో 'జ్ఞాపకశక్తి' పాఠం చెప్పిన బాధితుడు.

నెలల తరబడి తిరిగినా పట్టించుకోలేదని.. అధికారి టేబుల్‌పై బాదం పప్పులు చల్లి నిరసన..


ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే సామాన్యులకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పని జరగకపోయినా, అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పకపోయినా బాధితులు పడే వేదన వర్ణనాతీతం. ఇలాంటి ఓ విచిత్రమైన, అదే సమయంలో అందరినీ ఆలోచింపజేసే ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో వెలుగుచూసింది.

బిలాస్‌పూర్‌లోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఇంటికి సంబంధించిన ఫైల్ క్లియరెన్స్ కోసం ఓ వ్యక్తి గత కొన్ని నెలలుగా ఆ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్నిసార్లు విన్నవించినా, అధికారుల నుంచి మాత్రం నామమాత్రపు సమాధానాలే తప్ప, పనిలో పురోగతి కనిపించలేదు.

సదరు బాధితుడు ఫైల్ గురించి అడిగిన ప్రతిసారీ, సంబంధిత అధికారిణి నుంచి "నాకు ఫైల్ గుర్తులేదు.. చూస్తాను" అనే సమాధానమే వచ్చేది. నెలల తరబడి ఇదే తంతు కొనసాగడంతో బాధితుడి సహనం నశించింది. తన పని ఎప్పటికి పూర్తవుతుందో తెలియని అయోమయంలో ఉన్న ఆయన, అధికారులకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలోనే బాధితుడు కార్యాలయానికి వెళ్ళి మరోసారి తన ఫైల్ గురించి ఆరా తీశాడు. అధికారిణి ఎప్పటిలాగే ఏమీ తెలియదన్నట్లుగా సమాధానం ఇచ్చింది. వెంటనే అతను తన వెంట తెచ్చుకున్న బాదం పప్పులను టేబుల్ మీద పారబోశాడు. "ఈ బాదం పప్పులు తినండి.. అప్పుడు మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది, నా ఫైల్ కూడా మీకు గుర్తుకొస్తుంది" అంటూ ఘాటుగా స్పందించి అక్కడి నుంచి నిష్క్రమించాడు.

ప్రభుత్వ వ్యవస్థలో నిర్లక్ష్యం ఎంతలా వేళ్లూనుకుపోయిందో చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. సామాన్యుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, లేకపోతే ఇలాంటి నిరసనలు తప్పవని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

అధికారిణి టేబుల్‌పై బాదం పప్పులు చల్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే, ఈ వినూత్న నిరసనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో, సదరు వ్యక్తి ఫైల్ క్లియర్ అవుతుందో లేదో చూడాలి. ప్రజాసేవలో ఉండాల్సిన వారు బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

 

https://x.com/ChotaNewsApp/status/2045427648470642774

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.