మధ్యవర్తిత్వం ముసుగులో పాకిస్థాన్ ద్వంద్వ నీతి!

Publish Date:Apr 23, 2026

Advertisement

ఇస్లామాబాద్  మధ్యవర్తిత్వం.. ఇరాన్, అమెరికా సమీకరణాలను సంక్షిష్టం చేశాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో హెర్మూజ్ జలసంధి తెరుచుకునే దారులు ఉన్నాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ఎగసిపడుతున్న వేళ, పాకిస్థాన్ చర్యలు ఇరాన్, అమెరికా  మధ్య పరస్పర విశ్వాసాన్ని మరింత   బలహీనపరిచాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పాక్ తీరును డబుల్ క్రాస్ గా అభివర్ణిస్తున్నారు.  ఇస్లామాబాద్ ఒకవైపు మధ్యవర్తిత్వం మాటలు చెబుతూనే..  ఇరు దేశాల మధ్యా అగాధాన్ని మరింత పెద్దది చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  హోర్ముజ్  కేవలం ప్రాంతీయ సమస్య కాదు.. ఆ జలసంధి మూసుకుపోవడం అంటే..  ప్రపంచ ఇంధన వ్యవస్థకు నేరుగా షాక్ తగలడమే. 

ఈ పరిస్థితుల్లో అన్ని వైపుల నుంచీ పాకిస్థాన్ పై తీవ్ర ఆరోపణలు వినవస్తున్నాయి.  పాకిస్థాన్ తీసుకున్న కొన్ని దౌత్యపర చర్యలు ఇరాన్ కు అనుకూలమని కనిపించినా..  వాస్తవానికి ఇరాన్, అమెరికా మధ్య ఉన్న సున్నిత సమతౌల్యాన్ని అవి దారుణంగా దెబ్బతీశాయని అంటున్నారు. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై అనుమతి షరతులు, పాక్ నౌకలకే ప్రత్యేక అనుమతులు, అలాగే ఇస్లామాబాద్ లో ఇరాన్–అమెరికా చర్చలపై వస్తున్న వార్తలు.. ఇవన్నీ కలిసి పాకిస్థాన్  దౌత్యం నమ్మకం మీద ఆధారపడినదిగా కాకుండా, లావాదేవీల మీద ఆధారపడినదిగా మార్చేశాయి. ఇది కేవలం ఒక దేశం తీసుకున్న వాణిజ్య లేదా భద్రతా నిర్ణయం కాదు. ఇది ప్రాంతీయ విశ్వాసాన్ని, మధ్యవర్తిత్వం పేరుతో పని చేసే దేశాల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేశాయి.  

హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో అత్యంత కీలక మార్గాల్లో ఒకటి. ఇరాన్ దాన్ని పూర్తిగా మూసివేయలేదని చెబుతున్నప్పటికీ, ముందస్తు అనుమతి లేకుండా ప్రయాణాన్ని నిరోధించడం, నౌకలను వెనక్కి పంపించడం వంటి చర్యలు గ్లోబల్ మార్కెట్లను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. పాక్ జెండా నౌకలకు మాత్రమే ఇచ్చిన ప్రత్యేక అనుమతులు కూడా ఈ మార్గం ఎంత రాజకీయంగా మారిందో చూపిస్తున్నాయి. అమెరికా లేదా ఇరాన్ దేశాలలో ఏది  తప్పు లెక్క వేసినా.. దాని ప్రభావం కేవలం మధ్య ప్రాచ్యానికే  పరిమితం కాదు.. మొత్తంగా చమురు  ధరలు, బీమా ఖర్చులు,  రవాణా చైన్, ఆసియా దిగుమతిదారుల ఒత్తిడి పెంచుతుంది. ఇవన్నీ ప్రపంచదేశాలన్నిటిపైనా ప్రభావం చూపుతాయి.  

ఈ సంక్షోభంలో అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్ వైఖరి కీలకంగా కనిపిస్తోంది.  కఠిన హెచ్చరికలు, నావికా ఆంక్షలు, నరకం చూపిస్తా  తరహా భాషాప్రయోగం ఇవన్నీ.. కానీ  ఉద్రిక్తతలు పెంచేవిగానే ఉన్నాయి. అదే సమయంలో  యుద్ధాన్ని మరింత ముదరకుండా ఒక నిష్క్రమణ మార్గాన్ని కూడా అట్టేపెట్టుకోవడం కూడా కనిపిస్తోంది.

అయితే ఇక్కడే..  అమెరికా నిజంగా ఇరాన్ ను ఒప్పందం వైపు నడిపించాలనుకుంటోందా..  లేక ఒత్తిడి పెంచి తన డిమాండ్లను రుద్దాలనుకుంటోందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రంప్ కు దూకుడు కొత్తకాదు. పరుషంగా మాట్లాడడమూ అలవాటే..  పశ్చిమాసియా విషయంలో అతి చిన్న తప్పు కూడా బహుళ దేశాలను ఇబ్బందుల్లోకి నెట్టేయగలదు.  

 చర్చలు ఆగిపోయే చోట యుద్ధం మొదలవుతుంది..  యుద్ధం మొదలయ్యే చోట హోర్ముజ్ కూడా మూసుకుపోవచ్చు. అంటే ప్రస్తుతం..  ఇరాన్, అమెరికా సంబంధాలు ఒక  ప్రతిష్ఠంభణలో ఉన్నాయి.  అణు కార్యక్రమంపై  రెడ్ లైన్ లు, కాల్పుల విరమణపై కాలపరిమితులు, భద్రతా హామీలపై పరస్పర అనుమానాలు.. ఇవి చర్చలకు అవరోధంగా మారాయి.  ఏ పక్షం  చిన్న తప్పు చేసినా, దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని వ్యూహాత్మక ఆస్తిగా చూస్తోంది.  అమెరికా దాన్ని వ్యూహాత్మక ముప్పుగా భావిస్తోంది. ఈ రెండింటి మధ్యా రాజీ కుదరకపోతే..  హోర్ముజ్పై నిర్ణయం కూడా దౌత్యం ద్వారా కాకుండా సంక్షోభం ద్వారా తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది.  
దౌత్యం ఇంకా ముగిసిపోలేదు. కానీ దానికి మూడు విషయాలు అవసరం. ఒకటి.. విశ్వసనీయ మధ్యవర్తులు, రెండు.. స్పష్టమైన భద్రతా హామీలు,మూడోది.. ఫేస్ సేవింగ్ కు ఒక మార్గం. ఈ మూడూ లేకపోతే..   పరిష్కారం కనుచూపు మేరలో కూడా కనిపించదు. 

పాకిస్థాన్ ఈ చర్చల్లో నిజమైన మధ్యవర్తిగా నిలవాలంటే..  ఆ మధ్యవర్తిత్వం స్వప్రయోజనాల  లావాదేవీలా కనిపించకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే, ఇస్లామాబాద్   చర్చలతో కాకుండా.. సంక్షోభాన్ని మరింత సంక్లిష్టం చేసిన వేదికగా మిగిలిపోతుంది. 

హోర్ముజ్ మూసుకుపోతే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని ఇప్పటికే మార్కెట్లు అర్థం చేసుకుంటున్నాయి. ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, కరెన్సీ ఒత్తిడి చాలా చాలా త్వరగా  పెరిగిపోతాయి. తీవ్రమౌతాయి. ఇలాంటి సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం.. అది వాషింగ్టన్లో అయినా, టెహ్రాన్లో అయినా..  ఇస్లామాబాద్ లో  అయినా..  గ్లోబల్ సెక్యూరిటీపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. మొత్తం మీద ఈ సంక్షోభం ఒకే ప్రశ్న చుట్టూ తిరుగుతోంది.  పెద్ద యుద్ధాన్ని ఆపే దౌత్యం ముందుకు వస్తుందా, లేక పశ్చిమాసియా మరో పెద్ద సంక్షోభం వైపు వెడుతుందా?

References:

https://www.andhrajyothy.com/2026/international/uae/iran-stops-pakistanbound-ship-at-hormuz-over-lack-of-permission-sgr-spl-1507249.html 
https://ntvtelugu.com/news/iran-vs-israel-how-the-two-countries-went-from-friends-to-foes-686714.html 
https://www.instagram.com/ganeshwgl/ 
https://www.ntnews.com/news/iran-let-20-more-pakistani-flagged-ships-through-hormuz-strait-says-pakistans-dar-2343514 
https://www.facebook.com/groups/ssvmkadiri/ 

సంకలనం, సేకరణ: సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.