Publish Date:Apr 22, 2026
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలోనిన్న రాత్రి ఘోర ప్రమాదం సంభవించిందిా. బ్రేకులు ఫెయిలైన ఓ భారీ ట్రక్కు అదుపుతప్పి వరుసగా వాహనాలను ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 11 మంది సజీవ దహనమయ్యారు. డ్రమ్మాండ్‌గంజ్ లోయ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. నిన్న రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ద్రమాండ్‌గంజ్ ఘాట్ రోడ్డు మీదుగా లసోడా వైపు వెళ్తున్న ఓ ట్రక్కుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో డ్రైవర్ అదుపు కోల్పోయిన ఆ వాహనం ముందు వెళ్తున్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి మధ్యలో ఉన్న ఒక ఆల్టో కారు నుజ్జునుజ్జు కాగా, ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని కూడా వాహనాన్ని ట్రక్కు బలంగా ఢీకొంది.
ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో మంటలు చెలరేగాయి. ముఖ్యంగా బొలెరో వాహనం భారీ అగ్నికీలల మధ్య చిక్కుకోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో 11 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. .
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో మృతుల గుర్తింపు ప్రక్రియ కష్టంగా మారింది. ప్రమాదానికి గురైన వాహనాలు వేర్వేరు రాష్ట్రాలకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు బీహార్ రిజిస్ట్రేషన్‌తో ఉండగా, మరో కంటైనర్ మధ్యప్రదేశ్‌కు చెందినది. చిన్న కార్లు సోన్‌భద్ర, మీర్జాపూర్ జిల్లాలకు చెందినవిగా నిర్ధారించారు. అతివేగం, సాంకేతిక లోపం ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/13-people-burnt-alive-after-truck-collision-36-218013.html
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.