పరిస్థితులు తారుమారు.. ఒకప్పుడు పప్పులు.. ఇప్పుడు హీరోలు.!

Publish Date:Aug 10, 2026

Advertisement

భారతీయ రాజకీయాల్లో గత కొద్ది సంవత్సరాలుగా   ఎక్కువగా వినిపిస్తున్న,   చర్చనీయాంశమైన పదాలలో  పప్పు అన్న మొదటి వరుసలో ఉంటుంది.   ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి, వారి సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపించడానికి రాజకీయ నాయకులు తరచూ ఈ పప్పు పదాన్ని ఉపయోగించారు. జాతీయ రాజకీయాలలో ఈ పప్పు అన్న పదానికి ప్రత్యామ్నాయంగా రాహుల్ ను చూపుతూ ప్రత్యర్థులు తెగ ట్రోల్ చేసేవారు.

అలాగే ఏపీలో పప్పు పద ప్రయోగానికి ఎక్కువగా గురైన వారు నారా లోకేష్. లోకేష్ తన యువగళం పాదయాత్ర ద్వారా కంప్లీట్ గా  మేకోవర్ అయ్యారు. గతంలో ఆయనను పప్పు అంటూ ఎగతాళి చేసిన వారే లోకేష్ పరిణితిని, ట్రాన్స్ ఫార్మ్ అయిన తీరును ప్రశంసించాల్సిన పరిస్థితిలో పడ్డారు. గతంలో ఆయనను పప్పు అంటూ ఎగతాళి చేసిన వారు ఇప్పుడు సైలెంటైపోయారు.   పప్పు అన్న పదం ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి మారుతోందన్న చర్చ రాష్ట్ర రాజకీయాలలో జోరుగా సాగుతోంది. అలాగే జాతీయ రాజకీయాలలో కూడా రాహుల్ గాంధీ పరిణితి చెందిన నేతగా మేకోవర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 

కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.   ప్రజాస్వామ్యంలో ప్రజల ఆలోచనా విధానం, యువత స్పందన,  నాయకుల ఇమేజ్ ఎల్లప్పుడూ ఒకేలా ఉండవని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. 

పార్లమెంటు వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగే వాదనలు,   ప్రభుత్వ పనితీరుపై వచ్చే గణాంకాలు ఈ రాజకీయ పదాల పుట్టుకకు, వాటి అర్థం మారడానికి  కారణం అవుతున్నాయి.  లోక్‌సభలో జరిగిన చర్చల సమయంలో కొందరు ఎంపీలు ద్రవ్యోల్బణం, పడిపోతున్న పారిశ్రామిక వృద్ధి రేటు వంటి అధికారిక గణాంకాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ సమయంలో తయారీ రంగంలో నమోదైన ప్రతికూల వృద్ధి రేట్లు,  ఆర్థిక సంక్షోభ సూచీలను ఉదహరిస్తూ, అసలైన అసమర్థత ఎవరిదంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. సమాజంలో ఒకవైపు ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు, కేవలం సోషల్ మీడియా ప్రచారాలు లేదా క్యూరేటెడ్ ఇమేజ్ మేనేజ్‌మెంట్  శాశ్వతం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలో మారుతున్న యువత ఆలోచనా ధోరణి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం,ఆర్థిక అసమానతలు వంటి వాస్తవ సమస్యలను ప్రజలు  గమనిస్తున్నారు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ట్రెండ్లు, మీమ్స్,  క్రియేటర్ ఎకానమీ ద్వారా రాజకీయ నాయకుల వ్యూహాలను యువత తిప్పికొడుతోంది.   

ఒకప్పుడు ఒకరిని అప్రతిష్ఠపాలు చేయడానికి వాడిన పప్పు అన్న పదమే ఇప్పుడు బూమరాంగ్ అయ్యి.. ఎవరిని ఇరుకున పెడుతుందో గమనించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా, ప్రజాస్వామ్యంలో ఏ  ఇమేజ్ కూడా శాశ్వతం కాదని, ప్రజల చైతన్యమే అంతిమ తీర్పును ఇస్తుందని చరిత్ర పదే పదే నిరూపిస్తుంటుంది. రాహుల్ గాంధీని పప్పు అంటూ ఎగతాళి చేసిన వారూ, యువత అంటే 59 ఏళ్ల యువకులు కారంటూ ఎద్దేవా చేసిన వారూ ఇప్పటి పరిస్థితుల్లో యూత్ ట్రోలింగ్ కు గురి కావడమే కాకుండా వాస్తవ సరిస్థితులలో అడుగు వెనక్కు వేసి మరీ ఆబోరు కాపాడుకోవలసిన పరిస్థితిలో ఉన్నారు. 

Indian politics, Pappu political term, Parliament debate, economic indicators, political narrative, Trolling, bumarang

By
en-us Political News

  
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
చెన్నైలో బీఎస్ఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.