కమల దళంలో కొత్త నేతలకు పెద్ద పీట

Publish Date:Jan 6, 2023

Advertisement

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ  పాతకొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పార్టీ పూర్తి సమయ కార్యకర్తల సమావేశంలో, పార్టీ  మిషన్ 90  టార్గెట్  గా రోడ్ మ్యాప్ సిద్దం చేసిన విషయం తెలిసిందే. సరే నిజంగా బీజేపీ  ప్రస్తుతమున్న మూడు సీట్ల నుంచి ఒకేసారి 90 సీట్లకు చేరుకుంటుందా? అది అయ్యే పనేనా అనే విషయాన్ని పక్కన పెడితే, కమల దళం ‘మిషన్ టార్గెట్’ విషయంలో తగ్గేదేలే అంటోంది. పక్కగా ప్రణాళికలను రచించుకోవడమే కాకుండా కార్య క్షేత్రంలో అడుగులు వేయడం ప్రారంభించింది. 

అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీరియస్ గా దృష్టి పెట్టిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ బన్సల్ పోలింగ్ బూత్ స్థాయి నుంచి కేడర్ ను పెంచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 7,61,200 మంది పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలను ఎంపిక చేశారు. ఈ నెల 7న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వారందరితో వర్చువల్ గా సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేయనున్నారు. తెలంగాణ కోసం బీజేపీ ప్రత్యేకంగా సరళ్ యాప్ అందుబాటులోకి తెచ్చారు. ఆ యాప్ లో బూత్ కమిటీల వివరాలు, పార్టీ వ్యవహారాలు పొందుపరచనున్నారు. ఇదిలా ఉంటే ఎంపిక చేసిన పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలందరికీ బీజేపీ ఐడీ కార్డులతో పాటు డైరీలు అందజేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు డైరీలు మెయింటెన్ చేయాలని వారికి ఆదేశించింది.

నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ పరంగా బూత్ స్థాయిలో సమస్యలు, వాటి పరిష్కారానికి చర్యలతో పాటు పార్టీ బలోపేతానికి సంబంధించి అన్ని వివరాలు సేకరించాలని కార్యకర్తలకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 34,600 పోలింగ్ బూత్ లు ఉండగా.. ఒక్కో దానికి 22 మంది కార్యకర్తల్ని నియమించారు. వారిలో ఒకరు సోషల్ మీడియా బాధ్యతలు చూసుకోనున్నారని పార్టీ నేతలు చెపుతున్నారు. 

అదలా ఉంటే, రానున్న రోజుల్లో రాష్ట్ర పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈనెల ( జనవరి) 16, 17 తేదీలలో ఢిల్లీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో..పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను కొనసాగించే అంశంతో పాటు, ఈ సంవత్సరం జరగనున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలకు పార్టీ సమాయత్తం కావడంపై కూడా లోతుగా చర్చించనున్నారు. 

ఎన్నికలే ప్రధాన ఎజెండా జరుగతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో, ఇతర రాష్ట్రాలతో పాటుగా ఈ సంవత్సరం చివర్లో జరిగే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ‘ప్రత్యేక’ చర్చ ఉంటుంది అంటున్నారు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్చే విషయంతో పాటుగా, ముఖ్యమంత్రి అభ్యర్ధి విషయంలోనూ నాయకులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. బండి సంజయ్ ని పార్టీ అధ్యక్షునిగా కొనసాగిస్తూ, ఈటలకు పదోన్నతి కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసేఆర్ కు అన్ని విధాల సమ ఉజ్జీగా నిలిచి, కేసీఆర్ శక్తియుక్తులను సమర్ధవంతంగా ఎదుర్కోగల సత్తా సామర్ధ్యం ఉన్న ఈటల రాజేందర్  కు పార్టీలో సీఎం స్థాయి హోదాను కల్పిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అటు తెలంగాణ ఉద్యమ నేతల్లో, ఇటు బడుగు బలహీన వర్గాల ప్రజల్లో మంచి పటున్న ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తెర మీదకు తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈటలను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించక పోవచ్చును కానీ, పార్టీ నేతలకు క్లారిటీ  అయితే ఇస్తారని, అంటున్నారు.  ఏది ఏమైనా, ఈటలతో పాటుగా  ఇతర పార్టీల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు కొందరికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఖాయంగా ఉందని అంటున్నారు.

By
en-us Political News

  
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.