తెరపైకి మరో స్పాన్సర్డ్ పార్టీ ?

Publish Date:Jan 6, 2023

Advertisement

తెలంగాణలో ఇప్పటికే లెక్కకు మించి పార్టీలున్నాయి. మరో వంక ఏపీతో సమానంగా తెలంగాణలోనూ పటిష్ట పునాదులున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ) రీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే, ఏపీలో బీజేపీ పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన తెలంగాణలో ఒంటరి పోరాటానికి సిద్డమవుతోంది. గత ఎన్నికల నాటికి లేని వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్ టీపీ కొత్తగా తెరపై కొచ్చింది.

కేఏ పాల్ పార్టీ,  తెలంగాణ ప్రజల పార్టీ, ఇంటి పార్టీ, కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితి ( టీజేఎస్) ..  ఐపీస్ మాజీ అధికారి, ఆర్ ఎస్ ప్రవీణ కుమార్ సారధ్యంలో కొత్తగా అడుగులు వేస్తున్న బీఎస్పీ .. ఇలా చెప్పుకుంటూపోతే ..  చాలా చాలా పార్టీలే ఉన్నాయి. అయితే అందులో ఎన్ని పార్టీలు ఎన్నికల రాజకీయాలను సీరియస్ గా తీసుకుంటున్నాయి? ఏయే పార్టీలు, పరోపకారార్ధం పుట్టుకొస్తున్నాయి, స్పాన్సర్డ్  పార్టీలు ఎన్ని, అనేది చెప్పడం కొంచెం కష్టం. అయినా, మంది పెరిగే కొద్ది మజ్జిగ పలచనవుతుంది,అనేది మాత్రం నిజం.అందుకే, అధికార బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వ వ్యతిరేక, ప్రతిపక్ష అనుకూల ఓటును సాధ్యమైన మేరకు ముక్కలు ముక్కలు చేసేందుకు, చీల్చేందుకు, కొన్ని పార్టీలను స్పాన్సర్ చేస్తోందనే విమర్శ చాలా కాలంగా వినవస్తోంది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా, కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు, ఆ పార్టీల పట్ల అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వం యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు  గమనిస్తే, ఏ పార్టీని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఎవరు  ఎవరు వదిలిన  బాణమో .. అర్థం చేసుకోవడం కష్టం కాదని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. 

అదలా ఉంటే, తెలంగాణ రాజకీయ ముఖ్య చిత్రంలో, త్వరలోనే, బీఆర్ఎస్ చెప్పుచేతల్లో పనిచేసే మరో స్పాన్సర్డ్  పార్టీ తెర మీదకు వస్తుందని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో సంక్రాంతి తర్వాత మరో కొత్త ప్రాంతీయ పార్టీ రాబోతోందని మీడియా సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే బీజేపీ నేత ఉభయ తెలుగు రాష్టాలకు సంబంధించి మరో కీలక కీలక వ్యాఖ్య చేశారు.ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిపాలనను పక్కన పెట్టి, ఎన్నికల రాజకీయాలలో తల మునకలయ్యారని, ఆ ఇద్దరి పరస్పర సహకారంతో  పార్టీలను పుట్టిస్తున్నారని అంటున్నారు.

కాగా, ప్రభాకర్ ఏ పార్టీ గురించి ఈ వ్యాఖ్య చేశారనే విషయం పక్కన పెడితే,  ఏపీకి చెందిన ఒక ముఖ్య నేత సారథ్యంలో తెలంగాణలో కొత్త పార్టీ పుట్టుకోస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని 27 నియోజక వర్గాల్లో ఆంధ్రా సెటిలర్ల ఓటును చీల్చే లక్ష్యంతో, ఈ కొత్త పార్టీ పుట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్న నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త పార్టీని తెర మీదకు తెస్తున్నారని అంటున్నారు.

అయితే  రాజకీయ విశ్లేషకులు మాత్రం, ఒక సారి ప్రజల్లో వ్యతిరేకత వస్తే, బ్యాలెట్ పేపర్ మీద ఎన్ని పార్టీలు, ఎన్ని గుర్తులున్నా, అధికార పార్టీని ఓడించే పార్టీని గుర్తించి, గురి చూసి ఓటు వేస్తారని అంటున్నారు. అలాగే ఎన్నికల రాజకీయాల్లో వన్ ప్లస్ వన్  రెండు కావాలన్న నియమం లేనట్లే, మైనస్ ప్లస్ మైనస్ .. మైనస్ కావాలనే నియమం లేదని.. అంటున్నారు.

By
en-us Political News

  
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.