ఓటేయకుండానే బెంగళూరుకు జగన్‌ పయనం.!

Publish Date:Nov 1, 2026

Advertisement

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పులివెందులకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఓటు వేయకుండానే వెనుదిరిగారు. పులివెందులలో ఎన్నికలు సజావుగా సాగడం లేదని ఆరోపిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు. అనంతరం హుటాహుటిన హెలికాప్టర్‌లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.

పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి ప్రమీలమ్మ, కౌన్సిలర్‌ అభ్యర్థులతో కలిసి జగన్‌ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పోలింగ్‌ ప్రక్రియలో తమ పార్టీ ఏజెంట్లను అడ్డుకుంటున్నారని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

అనంతరం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌, ఆర్డీవో చిన్నయ్యతో జగన్‌ మాట్లాడి పోలింగ్‌ జరుగుతున్న తీరుపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయంటూ ఆరోపించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో తాను ఓటు వేయడం లేదని జగన్‌ ప్రకటించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. పులివెందులలో ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్‌సీపీ చేసిన ఆరోపణలు, జగన్‌ ఓటు వేయకుండానే వెనుదిరగడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

 

 

[ YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling ]

By
en-us Political News

  
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.