హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు భారీ షాక్..!

Publish Date:Jul 27, 2026

Advertisement

 

హైడ్రా కమిషనర్ పదవి నుండి తొలగించండి హైకోర్టు ప్రభుత్వన్నికి ఆదేశం..! 
 

పలు కోర్టు ధిక్కరణ (కాంటెంప్ట్) కేసుల విచారణలో తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో పదేపదే నిర్లక్ష్యం జరిగినట్లు అభిప్రాయపడిన న్యాయస్థానం, రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఆ స్థానంలో సమర్థుడైన మరో అధికారిని నియమించి బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసింది. విచారణలో భాగంగా లోతుకుంట భూముల వ్యవహారంపై రంగనాథ్ కోర్టుకు అఫిడవిట్ సమర్పిస్తూ క్షమాపణలు తెలిపారు. లోతుకుంట సర్వే నంబర్లు 1, 2లోని 40 ఎకరాల భూమిలోకి హైడ్రా ప్రవేశించలేదని, ఈ కేసులో పిటిషనరే అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

తనకు న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవం, విశ్వాసం ఉందని, కోర్టు ఆదేశాలను ధిక్కరించే ఉద్దేశం ఎప్పుడూ లేదని వివరించారు. అయితే, రంగనాథ్‌పై ఇప్పటికే 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదై ఉండటాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కోర్టులపై నమ్మకం ఉందని చెబుతున్నప్పుడు ఇన్ని కాంటెంప్ట్ కేసులు ఎందుకు నమోదయ్యాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల అమలులో పదేపదే ఉల్లంఘనలు చోటుచేసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం, ప్రజా అధికారులు న్యాయస్థానాల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. దీనికి స్పందించిన రంగనాథ్, తనకు న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవం, విశ్వాసం ఉన్నాయని కోర్టుకు తెలిపారు. 

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని, ఒకవేళ తన చర్యల వల్ల కోర్టుకు అసౌకర్యం కలిగినట్లయితే అందుకు క్షమాపణలు కోరుతున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే, వరుసగా కోర్టు ధిక్కరణ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో హైడ్రా వ్యవహార శైలిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ పదవిలో రంగనాథ్ కొనసాగడం సముచితం కాదని అభిప్రాయపడిన హైకోర్టు, ఆయనను ఆ పదవి నుంచి తొలగించి తగిన ప్రత్యామ్నాయ అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తాజా నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో, పరిపాలనా వ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది

Hydra Commissioner Ranganath, Telangana High Court, Hydra, Telangana goverment, CM Revanth reddy

By
en-us Political News

  
ఐపీఎస్ అధికారిణి సంజుక్తా పరాశర్ సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక కమాండో విభాగం కోబ్రా (CoBRA)కు తొలి మహిళా ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
పెళ్లయిన కేవలం రెండు వారాల్లోనే అమెరికాలోని మాసాచుసెట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ జాబీర్ హుస్సేన్ నిద్రలోనే కన్నుమూశారు. ఉదయం తల్లితో మాట్లాడిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలు, కుటుంబ సభ్యుల ఆవేదన మరియు పార్థివదేహం రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పూర్తి కథనం.
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.