పాతబస్తీలో షాకింగ్ ఘటన...జ్యూస్ తాగి నిద్రలోకి బాధితులు
Publish Date:Oct 14, 2025
Advertisement
హైదరాబాద్ పాతబస్తీ డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంచల్‌గూడలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఖురాన్ పఠనం పూర్తి చేసుకున్నానని చెప్పి ఆనందంగా జ్యూస్ పంచుతున్నానని ఒక యువకుడు స్థానిక దుకాణాలు, వీధుల్లో తిరుగుతూ జ్యూస్ పంపిణీ చేశాడు. కొంతమంది ఎలాంటి అనుమానం లేకుండా జ్యూస్ తాగగా, మరికొందరు నిరాకరించారు. అయితే తాగిన వారంతా కొద్ది సేపటికే గాఢ నిద్రలోకి జారుకున్నారని పోలీసులు తెలిపారు. దాదాపు 12 గంటల తర్వాత మెలకువ వచ్చిన బాధితులు ఏం జరిగిందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు .ప్రస్తుతం వారి పరిస్థితి స్థిరంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి వివరాలు తెలుసుకునేందుకు డబీర్‌పురా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు ప్రారంభించారు. యువకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, జ్యూస్‌లో ఏమి కలిపాడు, ఈ చర్య వెనుక ఉద్దేశం ఏమిటనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
http://www.teluguone.com/news/content/hyderabad-36-207945.html





