బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో నటుడు రమేశ్.. అండగా నిలిచిన మెగాస్టార్..!

Publish Date:Jul 26, 2026

Advertisement

 

గబ్బర్ సింగ్ నటుడు రమేశ్‌ కుటుంబానికి రూ. 3 లక్షలు అందించిన చిరంజీవి..!

సినీ పరిశ్రమలో తన సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు రమేశ్ కుటుంబానికి ఆయన ఆర్థిక, మానసి కంగా అండగా నిలిచారు. 'గబ్బర్ సింగ్' చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన నటుడు రమేశ్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై బ్రెయిన్ స్ట్రోక్‌తో అపోలో ఆస్పత్రి ఐసీయూలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు హరీశ్ శంకర్, పవన్ కల్యాణ్ టీం సభ్యులు ఆస్పత్రికి వెళ్లి రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వారి ద్వారా సమాచారం అందుకున్న చిరంజీవి వెంటనే స్పందించారు. అపోలో ఆస్పత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి రమేశ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు, అత్యుత్తమ వైద్యం అందిం చాలని కోరారు. అనంత రం రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి చికిత్స ఖర్చుల కోసం రమేశ్ భార్యకు రూ.3 లక్షల చెక్కును అందజేశారు. 

ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని చిరంజీవి హామీ ఇచ్చారు. రమేశ్ త్వరగా కోలుకుని మళ్లీ ఆరోగ్యంగా తిరిగి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు.మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు కూడా తన వంతు బాధ్యతగా రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి భరోసా ఇచ్చారు. కష్టాల్లో ఉన్న తోటి కళాకారులకు మెగా కుటుంబం మరోసారి అండగా నిలవడంపై సినీ ప్రముఖులు, అభిమా నులు, ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Megastar Chiranjeevi, Actor Ramesh Gabbar Singh,  Chiranjeevi donation actor Ramesh,
Megastar Chiranjeevi financial help, Actor Ramesh brain stroke, Nagababu donation actor Ramesh, 
Harish Shankar, Apollo Hospital 
 

By
en-us Political News

  
ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు ప్రాణం పోసిన డాక్టర్ మమత.. ప్రశంసల వెల్లువ..!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి తెలంగాణ ప్రాంత భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో బంగారు బోనాన్ని సమర్పించారు.
ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల నాటి సుదీర్ఘ స్వప్నం ఎట్టకేలకు సాకారమయ్యే దిశగా అత్యంత వేగంగా అడుగులు పడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపారు.
కేంద్ర విద్యాశాఖలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ.. !
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి.
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా అడిగి తెలుసుకున్నారు.
దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సరిహద్దుల భద్రతను కాపాడేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ
బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
ఇటీవల హైదరాబాద్‌ నగరంలో సంచలనం సృష్టించిన రిచ్ కిడ్ కేసు మరువకముందే..అలాంటి తరహాలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.