మావోయిస్టులు త్వరలో దాడులు చేస్తారా?

Publish Date:Mar 13, 2012

Advertisement

హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అనుసరించిన అణచివేత  విధానాల కారణంగా రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బే తగిలింది. పోలీసుల ఒత్తిడి కారణంగా మిగిలిన మావోయిస్టులు పొరుగునే ఉన్న ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ ప్రాంతాల్లో తలదాచుకున్నారు. అయితే వీరంతా మళ్ళీ ఏకమై రాష్ట్రంలో తమ ఉనికితోపాటు సత్తా కూడా రాష్ట్రంలో చూపాలని మావోయిస్టులు నేతలు పధకం వేస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. ఈ దాడులు గుంటూరు, ప్రకాశం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో జరగవచ్చునన్న అనుమానంతో అక్కడ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

 

చెన్నై, బెంగుళూరులో రహస్యంగా తయారుచేసిన రాకెట్ లాంచర్లను కొందరు మావోయిస్టులు ఇటీవల నల్లమల అటవీప్రాంతంలో పరీక్షించినట్లు తెలిసింది. గతంలో ప్రకాశంజిల్లా ఎర్రగొండపాలెంలో పోలీస్ స్టేషన్ పై దాడి చేసినప్పుడు నక్సలైట్లు రాకెట్ లాంచర్లను కూడా ప్రయోగించారు. గుంటూరుజిల్లా దుర్గి పోలీస్ స్టేషన్ లో కూడా నక్సల్స్ రాకెట్ లాంచర్లతో పేల్చివేశారు. ఆ తరువాత మరింత ఆధునీకరించిన రాకెట్ లాంచర్లను మావోయిస్టులు సమకూర్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సమాచారం అందడంతో ఏజెన్సీ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ల వద్ద కూడా భద్రతా మరింత పెంచారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ రక్షణ వలయాలు ఏర్పాటు చేయడంతో పాటు రాకెట్ లాంచర్లు ప్రయోగించినా  అవి పోలీస్ స్టేషన్ల పై పడకుండా ఉండేందుకు ఐరన్ తో చేసిన వలలను కూడా ఏర్పాటుచేస్తున్నారు.

By
en-us Political News

  
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.