హైదరాబాద్ సమీపాన మావోయిస్టుల సంచారం
Publish Date:Mar 10, 2012
Advertisement
హైదరాబాద్: హైదరాబాద్ సమీపాన గల మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు తెలియడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్దిరోజుల క్రితం మంచాల మండలంలో మావోయిస్టులు ఒక ఫ్యాక్టరీ సమీపాన సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి స్థానికులతోపాటు కార్మికులు కూడా హాజరయ్యారు. సమావేశం ముగిసిన వారంరోజులు తరువాత ఈ సమాచారం పోలీసులకు చేరడంతో వారు దిగ్ర్బాంతికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమై కూంబింగ్ దళాలను అక్కడకు పంపారు. స్థానిక సిఐని వేరే చోటికి బదిలీచేశారు. మావోయిస్టుల కదలికలను పసికట్టేందుకు మరో పోలీస్ అధికారిని నియమించారు. మావోయిస్టులను అందరూ మర్చిపోతున్న సమయంలో ఈ వార్తలు రావడం స్థానికులకు అందోళన కలిగించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-24-12533.html
http://www.teluguone.com/news/content/hyderabad-24-12533.html
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026





