విజయబాబు కార్యకలాపాలపై ఆరాతీస్తున్న ఇంటిలిజెన్స్
Publish Date:Feb 17, 2012
Advertisement
తెలుగువన్.కామ్ ప్రత్యేక కథనం
హైదరాబాద్: సమాచార హక్కు కమీషనర్లుగా నియమితులైన వివాదాస్పద వ్యక్తుల్లో అంధ్రప్రభ సంపాదకుడిగా పనిచేస్తున్న పి.విజయబాబు ఒకరు. ఈయనపై కూడా కొందరు ముఖ్యమంత్రికి, రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదులు పంపారు. దీనితో విజయబాబు నేపధ్యం ఏమిటన్న దానిపై ఆరా తీయలసిందిగా ఆయన తన క్రింది సిబ్బంది ద్వారా ఇంతిలిజిన్స్ వర్గాలను కోరినట్లు విశ్వాసనీయంగా తెలిసింది. విజయబాబు సమాచారహక్కు కమీషనర్ గా నియమితంకావడాన్ని ఆంధ్రప్రభ ప్రచురణకర్త మాజీ మంత్రి అయిన ముత్తా గోపాలకృష్ణ, అతని తనయుడు కూడా జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలిసింది. తనవద్ద సంపాదకుడిగా పనిచేస్తూ తెరవెనుక రాజకీయంచేస్తూ నిశబ్దంగా ఇటువంటి పోస్టును విజయబాబు కొట్టేయడంతో ముత్తా గోపాలకృష్ణ, అతని తనయుడు అసూయకు గురవుతున్నట్లు తెలిసింది. విజయబాబుకు వ్యతిరేకంగా పంపిన పిటిషన్ లలో ఆయన కళాశాలస్థాయి నుంచి జరిపిన కార్యక్రమాలపై విపులంగా సమాచారమిచ్చినట్లు తెలిసింది. విజయవాడలో ఆయన కళాశాల విద్యార్ధిగా ఉన్నప్పుడు దివంగత వంగవీటి మోహనరంగాకు ముఖ్యఅనుచురుడుగా ఉండేవాడు. రంగా స్థాపించిన యునైటెడ్ ఇండిపెండెన్స్ (యు.ఐ) అనే విద్యార్ధి సంఘానికి విజయబాబు చాలాకాలం కీలక నాయకుడుగా పనిచేశాడు. అంతేకాక అప్పట్లో రంగా స్కెచ్ లు వేయడం వెనుక విజయబాబు హస్తం ఉండేదని, విజయబాబు కామ్ గా ఎవరికైనా ఏమైనా చేయగలరనే ప్రచారం అప్పట్లో జరిగేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే విజయబాబు పాత్రికేయుడుగా అంధ్రప్రభలో చేరిన తర్వాత రౌడీ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. కానీ ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ ఆంధ్రప్రభను ముత్తా గోపాలకృష్ణకు విక్రయించిన తరువాత విజయబాబు ముత్తాకు సన్నిహితంగా మెలిగాడు. అంతేకాక ఎప్పటినుంచో ఆంధ్రప్రభలో పనిచేస్తున్న అనేకమంది ఉద్యోగులను ముత్తా ఎటువంటి పరిహారం ఇవ్వకుండా తొలగించడం వెనుక విజయబాబు హస్తం ఉందనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. విజయబాబు కార్మికుల విద్రోహి అంటూ అప్పట్లో ఆంధ్రప్రభ ఇద్యోగులు కరపత్రాలు కూడా పంచారు. ముత్తాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఆంధ్రప్రభ ఉద్యోగులను చీల్చడానికి వారి ఉద్యమాన్ని నీరుగార్చడానికి విజయబాబు తన తెలివితేటలను ఉపయోగించాడు. ఇటువంటి వ్యక్తి సమాచార హక్కు చట్టాన్ని ఎలా గౌరవిస్తాడంటూ పిటిషనర్లు తమ లేఖలో పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాకుండా విజయబాబు నియామకం అతని అర్హతలతో నిమిత్తం లేకుండా రాజకీయపరమైన నిర్ణయాలతో జరిగిందని కూడా వారు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. విజయబాబు సోదరుడు విక్రమ్ ఒకప్పుడు చంద్రబాబునాయుడి వద్ద పిఆర్ విభాగంలో పనిచేశాడని, ప్రస్తుతం చిరంజీవి వద్ద సన్నిహితంగా మెలుగుతున్నాడని, ఈ రాజకీయ నాయకుల ఆశీస్సులతోనే విజయబాబు సమాచారహక్కు చట్టం కమీషనర్ గా నియమితుడయ్యాడని వారు ఆ పిటిషన్ లో ఆరోపించారు.
http://www.teluguone.com/news/content/hyderabad-24-11980.html





