చిక్కుల్లో 'పెన్నా'ప్రతాపరెడ్డి
Publish Date:Feb 14, 2012
Advertisement
ప్రతాప్ రెడ్డిపై కత్తులు నూరుతున్న స్టాలిన్
హైదరాబాద్: యువనేతకు అత్యంత సన్నిహితుడైన పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాపరెడ్డి చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఎమ్మార్ ప్రాపర్టీ కుంభకోణం వ్యవహారంలో ఒకవైపు సిబిఐ ప్రతాపరెడ్డిపై దృష్టిని కేంద్రీకరించగా మరోవైపు తమిళనాడు మాజీ సిఎమ్ కరుణానిధి కుమారుడైన స్టాలిన్ ఇతనిపై కత్తులు నూరుతున్నట్లు తెలిసింది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనన్న భయంతో ఇప్పటికే ప్రతాపరెడ్డి తన కుటుంబ సభ్యులను విదేశాలకు పంపినట్లు తెలుస్తోంది. అరెస్ట్ కు భయపడి ప్రతాపరెడ్డి కూడా వారాంతంలో అజ్ఞాతవాసానికి పోతునట్లు తెలియవచ్చింది. స్టాలిన్ తో ప్రతారెడ్డికి వున్న వివాదం వివరాల్లోకి వెళితే...కొంతకాలం క్రితం వరకు ప్రతాపరెడ్డి స్టాలిన్ కు మంచి మిత్రుడిగా ఉన్నాడు. హైదరాబాద్ కు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుండడంతో ఇక్కడ భూములు కొనుగోలు చేయవలసిందిగా ప్రతారెడ్డి కొంతకాలం క్రితం స్టాలిన్ కు సలహా ఇచ్చినట్లు తెలిసింది. దీనికి తోడు స్టాలిన్ ప్రత్యర్ధి జయలలితకు హైదరాబాద్ శివార్లలో ఒక పెద్ద ఫాం హౌస్ ఉంది. దానికి ధీటుగా స్టాలిన్ కూడా ఇక్కడ ఫాం హౌస్ కట్టుకోవాలని ఆశించాడు. దీనికోసం ప్రతాపరెడ్డి ద్వారా బినామీ పేర్లతో స్టాలిన్ అనేక ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్త్ర్హోంది. ఇక్కడి వరకు బాగానే వున్నా ప్రతాపరెడ్డి కరుణానిధి మరో కుమారుడైన అళగిరి కి కూడా హైదరాబాద్ లో భూములు కొన్నాడు. అన్నదమ్ముల మధ్య ఎప్పటినుంచో వైరం ఉంది.అళగిరి భూముల కొనుగోలు ప్రతారెడ్డి ద్వారా జరగడం స్టాలిన్ కు రుచించలేదు. అనంతరం భూమి కొనుగోళ్ళ లావాదేవీల్లో తనను ప్రతాపరెడ్డి మోసగించాడనే అనుమానం స్టాలిన్ కు పట్టుకుంది. దీనిపై స్టాలిన్ యువనేతకు కూడా ఫిర్యాదు చేశాడని, ఆయన కూడా ఏమీ చేయలేక పోవడంతో స్టాలిన్ ప్రతాపరెడ్డిపై కత్తికట్టాడని తెలిసింది. స్టాలిన్ వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తుండటంతో ప్రతాపరెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడని, ఈ నేపధ్యంలో తన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచేందుకు విదేశాలకు పంపాడని తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/hyderabad-24-11895.html





