ఆజాద్ రాక..వాడి,వేడిగా సమన్వయ కమిటీ తొలి సమావేశం

Publish Date:Jan 4, 2012

Advertisement

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మధ్య సమన్వయం చేసేందుకు కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ నాయకత్వంలో అధిష్ఠానం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశం గురువారం సాయంత్రం గాంధీభవన్‌లో జరగనుంది. సమన్వయ కమిటీ తొలి సమావేశమే వాడిగా, వేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమన్వయ కమిటీ సభ్యులైన కొందరు ముఖ్య నాయకులు పోటాపోటీ నివేదికలను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. ముఖ్యమత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఇద్దరు నాయకులు పదేపదే చెబుతున్నప్పటికీ వివిధ సందర్భాల్లో వారి మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ఈ ఇద్దరు నాయకులు పోటాపోటీ నివేదికలను తయారు చేస్తుండటాన్ని బట్టి ఆజాద్ సమక్షంలోనే వీరి మధ్య ఉన్న విభేదాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదిర్చే అంశం ఎలాఉన్నా ముందు ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షునికి మధ్య సమన్వయం కుదర్చాల్సిన బాధ్యత ఆజాద్ మీద ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై చర్చించి నిర్ణయం తీసుకునే వీలుంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని గట్టెక్కించిన పీఆర్పీకి ఇవ్వాల్సిన పదవులపైనా ముఖ్యమంత్రి, బొత్సలతో చర్చించే అవకాశం ఉందంటున్నారు.


కాగా,  లేక్ వ్యూ అతిథి గృహంలో బస చేసిన ఆజాద్‌ను పలువురు నాయకులు కలుసుకోనున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలు ఉండటంతో పదవులను ఆశించేవారు విజ్ఞప్తులు చేయనున్నారు. ఉప ఎన్నికల తర్వాతనే మంత్రివర్గ మార్పులు జరగనున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భిన్నాభిప్రాయాలను అజాద్ వద్ద వ్యక్తం చేయనున్నారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన వారిని ఎలాగూ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నందున కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని కూడా మంత్రివర్గంలోకి ఇప్పుడే తీసుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు ఆజాద్‌కు విజ్ఞప్తి చేయనున్నారు. ఆదే సందర్భంలో మరి కొంతమంది ఎమ్మెల్యేలు అసలు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణే వద్దని, ఉప ఎన్నికల తర్వాత ఒకే సారి మంత్రివర్గ మార్పులు చేసి ప్రజారాజ్యం పార్టీకి చెందిన వారిని కూడా అప్పుడే తీసుకోవాలని ఆజాద్‌కు చెప్పనున్నారు. ఇది  ఇలా ఉండగా మంత్రి శంకరరావు వైఖరిపై ఆజాద్‌కు ఫిర్యాదు చేసేందుకు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మద్దతుదారులతో పాటు మరికొందరు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు.

By
en-us Political News

  
ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు.
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.