Publish Date:Jul 25, 2024
తెలంగాణ వార్షిక బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధికి పెద్ద పీట వేశారు. తెలంగాణ ఆర్థిక మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్ల రూపాయలతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన భట్టి.. తెలంగాణ బడ్జెట్ లో హైదరాబాద్ మహానగరం అభివృద్ధికి పది వేల కోట్ల రూపాయలు కేటాయించారు.
ఇంత భారీగా హైదరాబాద్ నగరానికి కేటాయింపులు జరపడం ఇదే మొదటి సారి. విశ్వనగరంగా మారుస్తున్నాం అంటే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ హైదరాబాద్ కు బడ్జెట్ లో ఈ స్థాయి కేటాయింపులు జరిగిన దాఖలాలు లేవు. ఈ పది వేల కోట్ల రూపాయలలో 3,065 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాల కల్పనకు, హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక సదుపాయల కల్పనకు 500 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే మోట్రోవాటర్ వర్క్స్ కు 3,385 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక హైడ్రా కు 200 కోట్ల రూపాయలు, మెట్రో రైలు ను విమానాశ్రయం వరకూ విస్తరించేందుకు 100 కోట్ల రూపాయలు కేటాయించారు.
ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధికి రెండు వందల కోట్ల రూపాయలు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే మెట్రోరైల్ విస్తరణకు 500, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్ పోర్టు వ్యవస్థకు 500 కోట్ల రూపాయలు కేటాయించారు. అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానసపుత్రిక లాంటి ముసీ సుందరీకరణ ప్రాజెక్టుకు 1500 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/huge-allocation-to-hyderabad-in-telangana-budget-39-181493.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?