జగన్ పాలన పాపాల మయం.. లోకేష్
Publish Date:Jul 19, 2022
Advertisement
బరిలో నిలవలేనివారు ఎంతటి పనికయినా సిద్ధపడతారన్నది అనాదిగా గమనిస్తున్నదే. ఇది రాజకీయా లకు అచ్చుగుద్దినట్టు అతుకుతుంది. అధికారంలో వున్నవారికి తాము ఏదయినా చేయగలమన్న గుడ్డి ధీమా వచ్చేస్తుందేమో, అబద్ధాలతో అవినీతి అక్రమాలతో, దాడులతో అధికారాన్ని పట్టుకుని ఊగులాడ టానికి సిద్ధపడటం జగన్ సర్కార్ బాగా నిరూపిస్తోందని విపక్షాలు ఇప్పటికే దుమ్మెత్తి పోస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ పాపాలు శిశుపాలుడి పాపాల వలె పండిపోయాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ పై మండిపడ్డారు. మూడేళ్ల పాలన ప్రజాదరణకు ఏమాత్రం నోచుకోలేదు, పైగా అన్ని పథకాలు, కార్యక్రమాలు విఫలమై ప్రజలు జగన్ పాలనను తిట్టుకుంటున్నారు, ఇక ఏమాత్రం భరించే స్థితిలో లేరన్నది స్పష్టమయింది. ఈ కారణంగా జగన్‌లో అసంతృప్తి పెరిగిపోయి దాడులకు దిగుతున్నారని లోకేష్ ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యారాజకీయాలకు, గూండాల దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని లోకేష్ ఆరోపించారు. రాజకీయ ఆధిపత్యం కోసం మీరు చేయిస్తున్న హత్యలు, దాడులే మీ పతనానికి దారులు. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి పై హత్యాయత్నం ముమ్మాటికీ మీ వైసీపీ గూండాల పనే అని లోకేష్ అన్నారు. బాలకోటిరెడ్డికి ఏమైనా జరిగితే వైసీపీ సర్కారు దే బాధ్యత వహించాలని, దాడిలో ఏకంగా వైసీపీ ఎంపీపీ భర్త పాల్గొన్నాడంటే..వైసీపీ రౌడీమూకలు ఎంతగా బరితెగించాయో అర్థం అవుతోందని, ఫ్యాక్షన్ మన స్తత్వం రక్తంలోనే ఉన్నదని, అందుకే జగన్ పాలనలో పల్నాడు ప్రాంతం రక్తసిక్తమవుతోందని లోకేష్ మండిపడ్డారు. ఇకనైనా హత్యారాజకీయాలు, దాడులు ఆపండి. లేదంటే ఇంతకి నాలుగింతలు మూల్యం చెల్లించేం దుకు సిద్ధంగా వుండండి. జగన్‌రెడ్డి అధికారం, పోలీసులు అండగా వున్నారని రెచ్చిపోతున్న వైసీపీ నేత లకు ఇదే చివరి హెచ్చరిక. మేము తిరగబడితే, మీ వెంట వచ్చేది ఎవరు? వైసీపీ అధికారం కోల్పోతే మిమ్మల్ని కాపాడేదెవరని నారా లోకేష్ అన్నారు.
http://www.teluguone.com/news/content/horrible-administrationlokesh-39-140056.html





