ఉన్నతాధికారుల్లో తారా చౌదరి ఫీవర్!
Publish Date:Apr 24, 2012
Advertisement
సాధారణంగా ఫీవర్ వస్తే ఆసుపత్రులకు వెళతారు. కాని కొంతమంది ఉన్నతాధికారులకు తారా చౌదరివల్ల వస్తున్నా ఫీవర్ కు కోర్టులకు వెళుతున్నారు. మాజీ డిజిపి ఎం.భాస్కర్ ఆ ఫీవర్ తోనే ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరో ఐఎస్ మాజీ అధికారి కూడా ముందస్తు బెయిల్ గురించే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. పురుషులందు పుణ్యపురుషులు వేరన్నట్టుగా ఐపీస్, ఐఎస్ అధికారులలో కొంతమంది అధికారులు వేరుగా ఉన్నారు. "అనుభవించు రాజా ... పుట్టింది ... పెరిగింది అందుకే అన్నట్టుగా తమ అధికారం వున్నది అందుకే అన్నట్టుగా వ్యవహరిస్తారు. తమకున్న అధికారంతో తమకు ఎదురులేదనుకుంటారు. ఇటువంటి అధికారులు జిల్లా అధికారులుగా వున్నప్పుడు ఈ అధికారులు డబ్బు కూడబెట్టడం కంటే ... "ఆ అంశానికే'' ప్రాధాన్యత ఇస్తారు. కొంతమంది జూదం, మద్యానికి బానిసలయ్యే విధంగానే వీరు "ఆ అంశానికి'' బానిస అవుతారు. చీర కట్టుకొని ఎవరు వచ్చినా ఆ దృష్టితోనే చూస్తారు. సహజంగా ఇటువంటి పనులుచేసే సమయంలో పోలీసులు వస్తారేమోననే భయం వుంటుంది. కానీ తామే పోలీసులకు బాస్ లు కావడంవల్ల అటువంటి భయాలు వుండవు. ఇక ప్రజలు కూడా ఇటువంటి అధికారులతో పనులు చేయించుకోవాలంటే తారా చౌదరి వంటివారిని ఆశ్రయిస్తారు.
http://www.teluguone.com/news/content/high-officials-24-13572.html





