ముఖ్యమంత్రి కి సుప్రీం ‘ఛీ’వాట్లు

Publish Date:Mar 25, 2021

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ పై చేసిన ఫిర్యాదును, సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి, గత సంవత్సరం అక్టోబర్ 6 వ తేదీన, జస్టిస్ ఎన్వీ రమణతో పాటుగా, ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు న్యాయమూర్తుల పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎబాబ్డేకు ఫిర్యాదు చేశారు. అందులో జగన్మోహన రెడ్డి, జస్టిస్ రమణ కుటుంబ సభ్యులు అమరావతి భూములకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారని, అదే విధంగా రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చేలా జస్టిస్ ఎన్వీ రమణ వారిని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.
జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదును అంతర్గత నిబంధనల ప్రకారం సమూలంగా పరీక్షించిన న్యాయస్థానం, ఫిర్యాదును కొట్టివేసిందని సుప్రీం కోర్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. జగన్మోహన్ రెడ్డి తమ ఫిర్యాదులో జస్టిస్ ఎన్వీ రమణ ఇతర న్యాయమూర్తులపై చేసిన ఆరోపణలు, పూర్తిగా నిరాధారమైననవి, అల్పమైనవి, తుచ్చమైనవి, అసత్యమైనవి న్యాయస్థానం చాలా తీవ్రంగా ముఖ్యమంత్రి దురుద్దేశాలను ఎండగట్టింది. అంతేకాదు, జగన్మోహన రెడ్డి న్యాయవ్యవస్థను బెదిరించేందుకు ఉద్దేశపూర్వకంగా నిరాధారమైన ఆరోపణలు చేశారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

న్యాయవ్యవస్థను బెదిరించే ప్రయత్నం చేయడమంటే సామాన్య మైన విషయం కాదు. అదీకాక, జస్టిస్ రమణ పై జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదుకున్న నేపధ్యాన్ని గమనిస్తే, అనేక అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నఆయన, ఎదో తెలియని భయంతో ఆరోపణలు చేశారన్న అభిప్రాయం సహజంగానే ఎవరికైనా కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డిపై ఇంచుమించుగా ఓ డజన్ వరకు క్రిమినల్ కేసులు, సిబిఐ, ఈడీ విచారణలో ఉన్నాయి. ఆయన జైలు జీవితం అనుభవించారు. అయన ఆస్తులను జప్తు చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. మరోవంక జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదుకు కొద్ది రోజుల ముందు, జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలోని ధర్మాసనం, న్యాయవ్యవస్థ పట్ల ప్రజలలో విశ్వాసం పెంచేందుకు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు ఇతర ప్రజాప్రతినిధులపై సుదీర్ఘకాలంగా పెండింగ్’లో ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. జస్టిస్ ఎన్వీ రమణ అదేశాలే, జగన్ రెడ్డి, ఫిర్యాదుకు మూలకారణమని చాలామంది భావిస్తున్నారు. అలాగే, న్యాయమూర్తి కాకముందు, న్యాయవాదిగా ఎన్వీ రమణకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా చంద్రబాబుతో తమకున్న వైరం కారణంగాను జస్టిస్ రమణపై జగన్ రెడ్డి ఫిర్యాదు చేసి ఉండవచ్చునని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఎందుకు ఫిర్యాదు చేశారన్నది కాదు.ప్రధాన న్యాయమూర్తి ప్రకటన ప్రకారం న్యాయవ్యవస్థను భయపెట్టే ఉద్దేశంతో న్యాయమూర్తులపై, ప్రధాన న్యాయమూర్తి కానున్న జస్టిస్ ఎన్వీ రమణ పై నిరాధారమైన ఆరోపణలు చేసిన వ్యక్తిపై సర్వోనంత నాయస్థానం ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది, అనేకమందికి కలుగు తున్న అనుమానం.ఫిర్యాదు చేసిన వ్యక్తి కీలక పదివిలో ఉన్నారు. ఆయన ఫిర్యాదు చేసింది సమాన్య వ్యక్తి పై కాదు. కొద్ది రోజుల్లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టన్నున్న న్యాయమూర్తి పై ఆయన అసాధారణ రీతిలో ఫిర్యాదు చేశారు. అయన చేసిన ఫిర్యదు దురుద్దేశ పూరితం అయినప్పుడు న్యాయస్థానం చర్యలు తీసుకుంటుంది ఎవరైనా భావిస్తారు. అలాంటిది ఏమీ లేక పోతే, సామాన్యులకు చాలా సందేహలు కలుగుతాయి.

అలాగే, అనేక క్రిమినల్ కేసులు ఎదుర్కుంటూ, ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి, న్యాయవ్యవస్థపై చేసిన ఫిర్యాదు, పూర్తిగా అసత్యం, నిరాధారం, అన్నిట్నీ మించి ఉద్దేసపూర్వకంగా చేసిన ఫిర్యాదుగా సర్వోన్నత న్యాయస్థానం నిరూపించిన తర్వాత అయిన ఏమి చేయాలి? కనీసం న్యాయస్థానానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి, తప్పోప్పుకుని, పదవికి రాజీనామ చేయాలి... కానీ, నవ్విపోదురు గాక నాకేటి సిగ్గను కుని తుడిచేసుకుపోతే.. అది ఆయనకేమో కానీ, ఆయన పదవికి మాత్రం అవమానం.

By
en-us Political News

  
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.