ఎన్నికల కోసమేనా.. హోదా చర్చ

Publish Date:Mar 25, 2021

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఇంకా ఎవరైనా అనుకుంటున్నారా, ఆశిస్తున్నారా, అంటే లేదు. సామాన్య ప్రజలనుంచి పార్లమెంట్ సభ్యుల వరకు అందరికీ, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి హోదా రాదన్న నిజం తెలుసు. అయినా పార్లమెంట్’లోపల వెలుపల, ముఖ్యంగా మీడియాలో హోదా పై చర్చ జోరుగా సాగుతోంది, ఎందుకు, అంటే, అదే రాజకీయం. ఎన్నికల సమయంలో సెంటిమెంట్స్ ను సొమ్ము చేసుకోవడం, రాజకీయ పార్టీలు అలవాటుగా మలచు కున్నాయి. ఇటీవల తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడో మూలన పడిన ఐటీఐఆర్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశాలను తెరాస తెర మీదకు తీసుకువచ్చింది. ఎన్నికల క్రతువు ముగిసన వెంటనే ఆ అంశాలు పక్కకు పోయాయి.

ఇప్పుడు ఏపీలో జరుగ్తునండి కూడా అదే. తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగతున్న నేపధ్యంలోనే హోదా అంశాన్ని మళ్ళీ తెర మీదకు తీసుకు వచ్చే ప్రయత్నం అటు రాజకీయ పార్టీలు, ఇటు మీడియా చేస్తున్నాయి. కేవలం ఉప ఎన్నికలో ప్రయోజనం కోసం మాత్రమే హోదా అంశాన్ని మళ్ళీ చర్చకు తెస్తున్నారని, వేరే చెప్పనక్కరలేదు.

ఇందులో భాగంగానే,లోక్ సభలో తెలుగు దేశం పార్టీ సభ్యుడు కింజారపు రామ్మోహన నాయుడు హోదాఅంశాన్ని ప్రస్తావించారు కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ రిప్లై ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని మరో మారు తెగేసి చెప్పింది. రామ్మోహననాయుడు ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిద్యానంద రాయ్, ఎప్పటిలానే, 14 ఆర్థిక సంఘాన్ని అడ్డుపెట్టుకుని, ఆర్థిక సంఘం హోదాకు ఎప్పుడొనే మంగళం పాడేసిందని, ఇక పై ఏ రాష్ట్రానికీ, ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని అరుణ జైట్లీ, నిర్మలా సీతారామాన్, సహా అనేక మంది కేంద్ర మంత్రులు గతంలో చెప్పిన సమదానాన్నే, మళ్ళీ మరో మరు రీప్లే చేశారు.

నిజానికి,హోదా ముగిసిన అధ్యాయమని ఎప్పుడోనే చెప్పిన కేంద్ర ప్రభుత్వం అప్పటినుంచి ఇప్పటి వరకు ఎవరు ఎన్ని విధాల అడిగినా అదే సమాధానం ఇస్తోంది.అయినా ఆంధ్ర ప్రదేశ్ అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు అవసరం చిక్కిన ప్రతి సంవత్సరంలోనూ హోదా ప్రస్తావన చేస్తూనే ఉన్నారు. ఒక్క హోదా విషయంలోనే కాదు, విభజన హామీలకు సంబందించిన ఇతరత్రా అంశాలను కూడా అడగడం కాదనిపించుకోవడం,కాదంటే, తాజాగా నిద్యానంద రాయి చెప్పినట్లుగా ఇచ్చినవేవో ఇచ్చాం, ఇవ్వవలసినవి ఏవో ఇస్తాం, ఈలోగా, ఉభయ తెలుగు రాష్ట్రాలు చర్చించుకుని ఇచ్చి పుచ్చుకోవడాలు పూర్తి చేసుకోవడాలు కానిచ్చుకోండని కేంద్రం ఎప్పటికప్పుడు చేతులు కడిగేసుకుంటోంది. ఇప్పుడు కూడా అదే పని చేసింది.

అయినా రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు రెండూ కూడా హోదాను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తూనే ఉన్నాయి. అది కూడా కేవలం ఎన్నికల సమయంలో, ఒక తురుపు ముక్కగా వాడుకుంటున్నాయి. నిజానికి హోదా విషయంలో కానీ, ఇతరత్రా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కానీ, అధికార, ప్రతిపక్ష పార్టీలకు పెద్దగాపట్టింపు లేదు. రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత రాష్ట్ర రాజకీయాలకు ఇవ్వక పోవడం వల్లనే, ఈ పరిస్థితి వచ్చిందని అందరికీ తెలుసు. అయినా, ఎన్నికలు రాగానే, హోదా, గుర్తుకువస్తోంది.

రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కనీసపాటి సయోధ్యత లేక పోవడం కూడా అందుకో ప్రధాన కారణం.ఇప్పుదు కాదు, విభజనకు ముందు నుంచి కూడా ఆంధ్ర ప్రాంత రాజకీయ పార్టీల ధోరణి, ఎడ్డెమంటే తెడ్డెమన్నట్లే సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి గురుంచి వేరే చెప్పనక్కర లేదు. రాష్ట్రాన్ని పాలించిన, పాలిస్తున్న ప్రాంతీయ పార్టీలి టీడీపీ , వైసీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తూనే ఉంది. మంచి చెడులు, విచక్షణ లేకుండా ఒకరు అవునన్నది ఇంకొకరు కాదనడం, ఒకరు కాదన్నది ఇంకొకరు అవుననడం చూస్తూనే ఉన్నాం.

నిజానికి, సాకేతికంగా చూస్తే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ముగిసిన అధ్యాయం అని కేంద్రం చెప్పడం కాదు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం హోదాకు ప్రత్యాన్మాయంగా ప్రతిపాదించిన ప్రత్యేక ప్యాకేజికి ఆమోదం తెలుపుతూ శాసన సభ తీర్మానం చేసింది.ఆ తీర్మానంతోనే హోదా కథ ముగిసింది. బయట లోపలా ఎవరైనా ఏదైనా మాట్లడ వచ్చును, కానీ, అసెంబ్లీ తీర్మానమే ఫైనల్, అదే శాసనం.ఆ తీర్మానం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ, హోదా ముగిసిన అధ్యాయమని చెప్పగలుగుతున్నాయి.

ఇప్పటికైనా, హోదా కాకపోయినా, కనీసం విభజన చట్టంలోని ఇతర హామీలు అయినా అమలుకావాలంటే, రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్రను పోషిస్తున్న వైసీపీ, టీడీపీ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కౌరవ, పాండవులు లాగా, ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళితే ఏదైనా ప్రయోజనం చేకూరుతుంది.

By
en-us Political News

  
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.