ఎయిర్‌పోర్టు.. భూములకు పోటు?

Publish Date:Mar 25, 2021

Advertisement

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయం. జాతికి అంకితం చేసిన సీఎం జగన్. ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు. 1,008 ఎకరాల్లో.. 153కోట్లతో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్మించింది. ప్రారంభోత్సవానికి కేంద్ర ఏవియేషన్ శాఖ తరఫున ఎవరూ హాజరుకాలేదు. కేంద్ర ప్రమేయం లేకుండా కర్నూలులో ఎయిర్‌పోర్టు కట్టడమేంటి? ఏదో తేడాగా ఉందంటున్నాయి ప్రతిపక్షాలు.

ప్రస్తుతం ప్రభుత్వ ఖజానా ఖాళీ. అవసరం ఉన్నా లేకపోయినా ఇబ్బడిముబ్బడిగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకే సొమ్ములు లేవు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమూ కష్టమవుతోంది. ఇలాంటి ఆర్థిక సంక్లిష్ట పరిస్థితుల్లో హడావుడిగా ఎయిర్‌పోర్టు నిర్మించడం వెనక వేరే మతలబు ఉందంటున్నారు. న్యాయ రాజధాని కర్నూలు నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగేలా ఓర్వకల్లు విమానాశ్రయం ఉపయోగపడుతుందన్నారు జగన్. ఇంకా మూడు రాజధానుల వివాదం కొలిక్కిరానే లేదు. కర్నూలులో న్యాయ రాజధానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కోర్టు తరలింపు ప్రక్రియపైనా నిషేధం కొనసాగుతోంది. ఆలూలేదు సూలూ లేదు.. ఇంకా న్యాయ రాజధాని నిర్మాణమే జరగలేదు.. అలాంటిది అప్పుడే ఇంత అర్జెంట్‌గా ఎయిర్‌పోర్ట్ రెడీ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. కర్నూలుకు సమీపంలోనే ఒకవైపు బెంగళూరు విమానాశ్రయం, మరోవైపు శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. మధ్యలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుతో పనేంటి? అంటే, విమానాశ్రయం ముసుగులో భూముల వ్యాపారం చేసేందుకే ఇదంతా చేస్తున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణ. 

వెయ్యి ఎకరాల్లో విమానాశ్రయం అనగానే కర్నూలు చుట్టూ భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఓర్వకల్లు సమీప ప్రాంతాల్లో ప్రభుత్వ భూములూ భారీగా ఉన్నాయి. ఎయిర్‌పోర్టు రావడంతో ప్రభుత్వ స్థలాల ధరలూ పెరిగాయి. ఇలా ధరలు పెంచేసి.. ఆ తర్వాత భూములు అమ్మేసి.. భారీగా ఆదాయం దండుకోవాలనేది సర్కారు కుతంత్రమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు, ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు స్థలాల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. అయితే, ఆ భూములన్నీ ఇప్పటికే వైసీపీ నేతల ఆధీనంలో ఉన్నాయని.. తమ వారికి మేలు చేసేందుకే విమానాశ్రయం తీసుకొచ్చారని చెబుతున్నారు. ఇలా, ప్రభుత్వ, ప్రైవేటు భూముల ధరలు పెంచేసి.. ఆ తర్వాత వాటిని అమ్మేసేందుకే.. ఇంత హడావుడిగా ఓర్వకల్లు విమానాశ్రయాన్ని రెడీ చేశారని అంటున్నాయి విపక్షాలు. 

By
en-us Political News

  
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.