తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు.!
Publish Date:Aug 23, 2026
Advertisement
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో సోమ, మంగళ వారాల్లో (ఆగస్టు 24, 25) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సోమవారం (ఆగస్టు 24) అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయా జిల్లాల యంత్రాంగం ప్రజలకు సూచించింది. అలాగే.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగుల సమీపంలో నివసించే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. Heavy rains in telangana, Twodays, Yellow Alert, IMD
http://www.teluguone.com/news/content/heavy-rains-in-telangana-24-229639.html





