80 వేల చదరపు మీటర్లలో మెగా ఎక్స్‌పో.. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు.!

Publish Date:Nov 23, 2026

Advertisement

హైదరాబాద్ వేదికగా జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌-2026’ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్‌లలోనే 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అతిపెద్ద బహుళ రంగాల ఎక్స్‌పోగా దీనిని తీర్చిదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ సదస్సు జరగనుంది.

సమ్మిట్ ఏర్పాట్లపై సోమవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సదస్సు వేదిక, ఎగ్జిబిషన్ హాళ్లు, అంతర్జాతీయ ప్రతినిధుల ఆహ్వానాలు, వివిధ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలే ప్రధాన లక్ష్యంగా సమ్మిట్‌ను నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ఈ గ్లోబల్ సమ్మిట్‌లో రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్, స్టార్టప్ పెవిలియన్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్‌పో, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శన, తెలంగాణ పెవిలియన్, ఎడ్యుకేషన్ ఎక్స్‌పో, క్లైమేట్ కాంక్లేవ్, ట్రైబల్ సమ్మిట్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రంగం సిద్ధమైంది.

పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో ప్రవేశం నుంచి వసతి వరకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతినిధులు సులభంగా ప్రవేశించేలా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. ఆహ్వానాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు అతిథులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు.

తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రపంచానికి చాటిచెప్పేలా తెలంగాణ పెవిలియన్‌ను రూపొందించాలని సీఎం సూచించారు. కాకతీయుల శిల్పకళ, సమ్మక్క-సారలమ్మ ఆలయ తోరణాల నమూనాలు, సోమశిల ఆలయం, నిర్మల్ చిత్రకళ, భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు వంటి ప్రత్యేకతలను ప్రదర్శించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి, గాంధీ సరోవర్ ప్రాజెక్టు సహా భవిష్యత్ ప్రణాళికలను కూడా ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఇది కూడ చదవండి: ఫేస్‌ క్రీమ్‌ వాడితే కిడ్నీలు డ్యామేజ్..అసలేం జరిగిందంటే.!


ముఖ్యమైన అంతర్జాతీయ ప్రతినిధులకు ఆహ్వానాలు పంపే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులకు అప్పగించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా సదస్సుకు ఆహ్వానించాలని, పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు, రక్షా ఎక్స్‌పో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. డిసెంబర్ 7న ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎయిర్ షోతో పాటు ఇతర ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. వీటిని వీక్షించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. సందర్శకుల కోసం 30 ఫుడ్ స్టాళ్లతో పాటు చేనేత వస్త్రాల ప్రదర్శనకు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు.

ట్రైబల్ సమ్మిట్‌లో భారతదేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన గిరిజన కళాబృందాలు తమ సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేయనున్నాయి. ఇక క్లైమేట్ కాంక్లేవ్‌లో సద్గురు జగ్గీ వాసుదేవ్, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, అంతర్జాతీయ స్థాయి పర్యావరణ నిపుణులు ప్రసంగించనున్నారు. ఇక్రిశాట్ వంటి సంస్థల శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు, స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వాములను చేయనున్నారు. గ్రీన్ ఎకానమీకి సంబంధించిన పెట్టుబడులపై ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.

ఎడ్యుకేషన్ ఎక్స్‌పోలో యూకే, యూరోపియన్ పెవిలియన్లతో పాటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల ప్రదర్శనలు ఉండనున్నాయి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఐటీ హైదరాబాద్, నల్సార్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు అంతర్జాతీయ విద్యావేత్తలతో చర్చించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న అంతర్జాతీయ విద్యావేత్తలు, నిపుణులతో ‘స్కూల్స్ ఆఫ్ ది ఫ్యూచర్’ అంశంపై ప్రత్యేక చర్చలో పాల్గొంటారు. డిసెంబర్ 8న ‘విద్యా సంస్థల సంస్కరణలు’ అనే అంశంపై జరిగే చర్చలోనూ పాల్గొననున్నారు.

ఇక ఇండియా జాయ్ కాంక్లేవ్‌లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాలకు చెందిన దాదాపు 150 కంపెనీలు పాల్గొననున్నాయి. అడోబ్, సోనీ, ఉబిసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలు తమ సాంకేతికత, ఆవిష్కరణలను ప్రదర్శించనున్నాయి.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన దాదాపు 1,500 మంది కంపెనీల సీఈవోలు, ఎండీలు, పెట్టుబడిదారులు, రాయబారులు సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ఆసక్తి చూపినట్లు అధికారులు వెల్లడించారు. మరో 1,500 మంది పారిశ్రామిక రంగ ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. సాధారణ పౌరులు, ఔత్సాహికులు కూడా ఈ ప్రదర్శనలను సందర్శించేలా డిసెంబర్ 10 నుంచి 13 వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

మొత్తంగా పెట్టుబడుల ఆకర్షణతో పాటు తెలంగాణ పారిశ్రామిక సామర్థ్యం, సాంకేతిక ప్రగతి, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.


మీకు నచ్చవచ్చు: గోల్డ్ లోన్‌ తీసుకున్న వారికి షాక్..ఎందుకంటే.!

మీకు నచ్చవచ్చు: Gen z: 24 ఏళ్లకే డిప్యూటీ మేయర్‌..టీడీపీ కూటమి సంచలన నిర్ణయం.!

 

 

[  Invest Telangana Global Summit 2026, Revanth Reddy, Telangana Global Summit, Bharat Future City, Defence Expo, India Joy, Startup Pavilion, Telangana Investments, Education Expo, Climate Conclave ]


 

By
en-us Political News

  
తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి ఉద్యమ గాథ వెనుక ఎన్నో కన్నీళ్లు, ఎన్నో త్యాగాలు దాగి ఉన్నాయి.
తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికత వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తోంది
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది.
అమ్మకు బంగారం కొనివ్వాలనుకున్నాడు.. సైబర్ మోసం బలితీసుకుంది.!
ట్రైనీ ఐపీఎస్ అధికారి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సహచర ట్రైనీ మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
తెలంగాణ గోల్డ్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన యాదగిరి చిన్ని గౌడ్ అలియాస్ దర్గా చిన్ని పహిల్వాన్ వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది.
హరీశ్‌రావుకు అసలు గురువు KCR కాదు..YSR.!
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ హత్య కలకలం రేపింది.
అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే, వాటికి దూరంగా జరిగి పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఈ మేరకు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాలలో మైకుల ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. 
విజేతలను అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్‌.!
మహబూబాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ కురవి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం వద్ద ఉన్న ఓ సాధారణ దుకాణం వేలంలో ఊహించని అద్దె పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.