జాతీయ పోలీస్ బ్యాండ్ పోటీల్లో తెలంగాణ పోలీస్ సత్తా.. బిగిల్ విభాగంలో రజత పతకం.!

Publish Date:Nov 22, 2026

Advertisement

విజేతలను అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్‌.!

 జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీస్ మరోసారి తన ప్రతిభను చాటుకుంది. 27వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీలు (2026–27)లో బిగిల్ విభాగంలో తెలంగాణ పోలీస్ బృందం రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ విజేతలను అభినందించారు.నవంబర్ 16 నుంచి 20 వరకు హైదరాబాద్‌లోని సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో ఈ పోటీలు జరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలతో పాటు కేంద్ర పోలీసు బలగాలకు చెందిన బ్యాండ్, బిగిల్ బృందాలు పోటీల్లో పాల్గొన్నాయి. 

గట్టి పోటీ మధ్య తెలంగాణ బృందం రజత పతకం సాధించడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ పోలీస్ ప్రతిభను చాటడం గర్వకారణమని పేర్కొన్నారు. పోలీస్ బిగిల్, బ్యాండ్ బృందాలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్ది, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రజత పతక విజేతలు వీరే..!

ఈ బృందానికి ఎస్. సంతోష్ (HC 1967) ఇన్‌చార్జ్, కెప్టెన్‌గా వ్యవహరించగా, కె. స్వామి (HC 2562), ఎస్. వెంకటయ్య (HC 873), జి. వెంకటస్వామి (HC 1427), ఏవీఎస్ భావన రుషి (HC 197), పీసీలు కె. రామ్‌లాల్ (PC 3361), ఎస్. ప్రవీణ్ కుమార్ (PC 10250) సభ్యులుగా ఉన్నారు.వీరంతా రాష్ట్రంలోని వివిధ పోలీస్ బెటాలియన్లు, పోలీస్ శిక్షణ సంస్థలు, హైదరాబాద్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఐజీ డా. గజరావు భూపాల్, స్పోర్ట్స్ డీఎస్పీ డా. రామారావుతో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

మీకు నచ్చవచ్చు: నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రభాస్ మద్దతు: ప్రత్యేక టీ-షర్టులను ఆవిష్కరించిన కిషన్ రెడ్డి

మీకు నచ్చవచ్చు: రేకుల గదికి నెలకు రూ. 2.12 లక్షల అద్దె.. ఎక్కడో తెలుసా?

 

[ Telangana Police, DGP CV Anand, All India Police Band Competition 2026-27, 27th All India Police Band Competition, Telangana Police Silver Medal, Bugle Competition, CRPF Group Centre Hyderabad, Telangana Police Band Team, Police Achievements ]

By
en-us Political News

  
తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి ఉద్యమ గాథ వెనుక ఎన్నో కన్నీళ్లు, ఎన్నో త్యాగాలు దాగి ఉన్నాయి.
తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికత వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తోంది
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది.
అమ్మకు బంగారం కొనివ్వాలనుకున్నాడు.. సైబర్ మోసం బలితీసుకుంది.!
ట్రైనీ ఐపీఎస్ అధికారి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సహచర ట్రైనీ మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
తెలంగాణ గోల్డ్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన యాదగిరి చిన్ని గౌడ్ అలియాస్ దర్గా చిన్ని పహిల్వాన్ వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది.
హరీశ్‌రావుకు అసలు గురువు KCR కాదు..YSR.!
హైదరాబాద్ వేదికగా జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌-2026’ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ హత్య కలకలం రేపింది.
అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే, వాటికి దూరంగా జరిగి పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఈ మేరకు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాలలో మైకుల ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. 
మహబూబాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ కురవి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం వద్ద ఉన్న ఓ సాధారణ దుకాణం వేలంలో ఊహించని అద్దె పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.