తెలంగాణకు భారీ వర్ష సూచన.. పది జిల్లాలకు ఎల్లో అలర్ట్.!

Publish Date:Jul 29, 2026

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే మంగళ, బుధ (జులై 28, 29) తేదీలలో తెలంగాణలోన పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. రానున్న రెండు మూడు రోజులలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమౌంది.  ముఖ్యంగా పది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 

బంగాళాఖాతంలో ఏర్పడిన   వాయుగుండం ప్రభావారనికి తోడు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండ దెబ్బతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షాలు పెద్ద ఉపశమనాన్ని అందించినప్పటికీ.. భారీ వర్షాల హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది.  ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు,   ఈదురుగాలులతో   విస్తారంగా  వర్షాలు కురుస్తున్నాయి.   రానున్న రోజులలో కూడా రాష్ట్రంలో ముఖ్యంగా  ఉత్తర తెలంగాణ జిల్లాలు,   హైదరాబాద్  పరిసర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

  వాతావరణ శాఖ సూచనల ప్రకారం  గురు, శుక్రవారాల్లో (జులై 30, 31) సైతం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.   ఈ వర్షాల వల్ల పట్టణాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ట్రాఫిక్ స్తంభించడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో  రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం,  విపత్తు నిర్వహణ బృందాలు  అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు. 

Telangana Rains, IMD Yellow Alert, Telangana Weather Forecast, Hyderabad Rains Update, Depression Rain Alert

By
en-us Political News

  
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న సమర వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది.
అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా..!
వైసీపీ అధినేత జగన్ వైఖరిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి రగిలించిన అమర గేయం
ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై ప్రవళ్లిక పట్ల దురుసు ప్రవర్తన.. చర్యలకు డిమాండ్..!
జగన్‌కు ములాఖత్‌కు నిరాకరణ.. జైలు వద్ద సీదిరి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. !
మానవత్వం మరుగున పడిపోతోందా? కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాల్సిన చేతులే.. అదను చూసి లూటీకి తెగబడుతున్నాయా?
విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై వైసీపీ నేతలు దురుసు ప్రవర్తన..!
పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు..!
గచ్చిబౌలిలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మట్టి కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థ, నిరుద్యోగం, ఉద్యోగ నైపుణ్యాలు (స్కిల్స్) అంశాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.