ఇరాన్‌తో యుద్దం ముగిసిందని వైెట్ హౌస్ ప్రకటించింది. దాంతో ఇరాన్‌తో యుద్దానికి యూఎస్ కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం లేకుండా ట్రంప్ సర్కారు జాగ్రత్త పడింది. ఇప్పటికే సెనెట్లో విచారణకు హాజరైన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో, అమెరికాకు సంబంధించిన ఒక కీలక చట్టం గురించి చర్చ మొదలైంది. అదే 1973 నాటి వార్ పవర్ చట్టం . ఈ చట్టం ప్రకారం, కాంగ్రెస్ అనుమతి లేకుండా అమెరికా అధ్యక్షుడు యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టం వాస్తవంగా ఎంతవరకు అమలవుతోంది అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. యుద్ధంపై తుది నిర్ణయం ఒక్క అధ్యక్షుడి చేతిలోనే కాకుండా, ప్రజల ప్రతినిధులైన కాంగ్రెస్ చేతుల్లో కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం అమెరికా అధ్యక్షుడు సైనిక చర్యలు ప్రారంభించిన 48 గంటల్లో కాంగ్రెస్‌కు సమాచారం ఇవ్వాలి.
కాంగ్రెస్ అనుమతి లేకుండా గరిష్ఠంగా 60 రోజుల వరకు మాత్రమే యుద్ధాన్ని కొనసాగించవచ్చు. ఆ తర్వాత సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి మరో 30 రోజుల గడువు తీసుకోవచ్చు. అంటే మొత్తం మీద 90 రోజుల్లో యుద్ధాన్ని ముగించాలి లేదా కాంగ్రెస్ నుంచి అధికారిక అనుమతి తీసుకోవాలి. ప్రస్తుతం ఇరాన్‌తో అమెరికా యుద్ధం ప్రారంభమై 60 రోజులు దాటింది. ఈ యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి లేదు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం యుద్దం ముగిసినట్లు కీలక వాదనను ముందుకు తెచ్చింది. ఆ క్రమంలో ఇరాన్‌తో యుద్దం నిజంగా ముగిసిందా? .. అనుమతి తీసుకోవడం ఇష్టం లేక సెనెట్‌ను వైట్‌హౌస్ మభ్యపెడుతోందా? అన్న చర్చ మొదలైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/has-the-war-with-iran-ended-36-218838.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.