యూఎస్ స్పిరిట్ ఎయిర్‌లైన్స్ మూత

Publish Date:May 2, 2026

Advertisement

అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ తాజాగా తన విమాన సర్వీసులన్నిటినీ రద్దు చేసింది. తన కార్యకలాపాలు అన్నిటికీ త్వరలో ఫుల్ స్టాప్ పెడతామని శనివారం (మే 2) వెల్లడించింది. అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది. ఎయిర్‌లైన్స్ మాతృసంస్థ స్పిరిట్ ఏవియేషన్ హోల్డింగ్స్ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది.  కస్టమర్ సర్వీస్ అందుబాటులో లేదని కూడా సంస్థ వెబ్‌సైట్‌లో నోటీసు కనిపించింది. అయితే.. ఇప్పటికే టికెట్లు కొన్న వారికి డబ్బుల రీఫండ్‌ ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని కూడా సంస్థ తెలిపింది.

ఇక స్పిరిట్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల నిలిపివేతపై కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ డేవ్ డేవిస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న సంస్థ పునర్‌వ్యవస్థీకరణ ప్లాన్‌పై బాండ్ హోల్డర్స్‌తో మార్చి నెలలో అంగీకారం కుదిరిరిందన్నారు. అయితే, అకస్మాత్తుగా విమాన ఇంధన ధరలు పెరగడంతో పరిస్థితి చేయిదాటి పోయిందన్నారు. కంపెనీ కార్యకలాపాలను నిలిపివేయడం మినహా మరో దారి లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. 

ఇరాన్‌తో యుద్ధం మొదలయ్యాక అమెరికాలో విమాన ఇంధన ధరలు రెండింతలు అయ్యాయి. దీంతో, అనేక ఎయిర్‌లైన్స్ ఇప్పటికే ఈ ఏడాది లాభాల అంచనాలను తగ్గించుకున్నాయి. కార్యకలాపాల విస్తరణపై పెట్టుబడులకు కూడా బ్రేక్ చెప్పాయి. అప్పుల భారం, కార్యనిర్వహణ వైఫల్యాల కారణంగా స్పిరిట్ ఎయిర్‌లైన్స్ 2024 నవంబర్‌లోనే దివాలా తీసినట్టు ప్రకటించింది. ఆ తరువాత పునర్‌వ్యవస్థీకరణ ప్లాన్‌లో భాగంగా మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించింది. కంపెనీని పూర్తిగా గట్టెక్కించేందుకు మరో ప్రణాళికపై కూడా చర్చలు జరుగుతున్నాయి. సంస్థను ఆదుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం శుక్రవారం ఒక ప్లాన్‌ను ప్రతిపాదించింది. ఇదే తన చివరి ఆఫర్ అని కూడా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఈ క్రమంలోనే స్పిరిట్ ఎయిర్‌లైన్స్ తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

By
en-us Political News

  
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ల్లభనేని బాబూరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాబూరావు మృతి పార్టీకి తీరని లోటని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. బాబూరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.