సూరిబాబు ఇంతపని చేస్తాడనుకోలేదు!
Publish Date:Mar 16, 2012
Advertisement
తూర్పుగోదావరిజిల్లా టిడిపి నాయకులు గుత్తుల సూర్యనారాయణబాబు వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు అదే పార్టీకి చెందిన తమ ప్రత్యర్థులపై దాడులకు దిగడంతో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గుత్తులసూర్యనారాయణబాబు ఇంతపని చేస్తాడని తామెప్పుడూ ఊహించలేదని జిల్లా టిడిపి సీనియర్ నాయకుడొకరు తెలుగువన్.కామ్ వద్ద వాపోయాడు. గుత్తుల చర్యతో జిల్లాలో పార్టీ పరువు పోయిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశాడు. రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైయస్సార్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే పిల్లి సుభాస్ చంద్రబోస్ పోటీచేయబోతున్నారు. ఆయనపై పోటీచేసే టిడిపి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. గత ఎన్నికల్లో పిల్లి సుభాస్ చంద్ర బోస్ పై గుత్తుల సూర్యనారాయణబాబు పోటీచేసి పరాజయం పాలయ్యారు. అయితే ఈసారి కూడా తనకే టిక్కెట్ కేటాయించాలని ఆయన పట్టుబట్టారు. దీనికి పార్టీ అధిష్టానం నిరాకరించడంతో ఆయన అనుయాయులు అనుగ్రహించి రామచంద్రాపురం నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశంపార్టీ సమావేశంలో విధ్వంసం సృష్టించారు. గుత్తులను వ్యతిరేకిస్తున్న నాయకులపై దాడులు జరిపారు. దీంతో తెలుగు దేశం పార్టీ నుంచి గుత్తుల సూర్యనారాయణబాబును సస్పెండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/guttula-suryanarayana-babu-24-12695.html





