బిసి అభ్యర్ధికి మాచర్ల కాంగ్రెస్ టిక్కెట్?

Publish Date:Mar 28, 2012

Advertisement

గుంటూరుజిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రయోగాలకు సిద్ధమవుతుంది. బిసి ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి అగ్రవర్ణాలకు బదులు బిసి అభ్యర్ధికి టిక్కెట్ ఇచ్చి అదృష్టం పరీక్షించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నియోజకవర్గంలో 1,97,575 మంది ఓటర్లు ఉండగా వీరిలో బిసి ఓటర్లు 70 వేల మంది, ముస్లిం ఓటర్లు 20వేల వరకూ ఉన్నారు. ఈ గణాంకాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఈసారి బిసి అభ్యర్ధిని రంగంలోకి దింపాలని యోచిస్తోంది. ఇప్పటివరకు మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి లక్ష్మారెడ్డి, కర్రి పున్నారెడ్డిల్లో ఎవరో ఒకరికి టిక్కెట్ లభిస్తుందని భావించారు.

 

అయితే అధిష్టానం ఆలోచన వేరే విధంగా ఉంది. మరోవైపు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ టిక్కెట్ ను తన సన్నిహితులు కె. చెన్నకేశవరావుకు ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగా ఎంపి రాయపాటి సాంబశివరావు తన సన్నిహితుడు గండ్రకోట రాంబాబుకు టిక్కెట్ ఇప్పించాలని ప్రయత్నిస్తున్నారు. వీరికి తోడు మార్కెట్ యార్ట్ చైర్మన్ మద్దిగపు వెంకటరామిరెడ్డి, దివంగత సుందర రామిరెడ్డి తనయుడు మదన మోహన్ రెడ్డి, మున్సిపాల్ మాజీ చైర్మన్ కామనబోయిన కోటయ్య పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

 

 

By
en-us Political News

  
సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు అధికారులు కీలక చర్యలకు సిద్ధమవుతున్నారు.
హనుమకొండ జిల్లా కాజీపేటలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
గోదావరి తీరం వెంబడి ఉన్న దేవాలయాలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ప్రజలలో విస్తృతంగా ప్రజారం చేయడం ద్వారా విశేష ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించింది. అలాగే  బాసర నుంచి భద్రాచలం వరకు కారిడార్ ఏర్పాటు చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో పర్యాటక రంగం, అనుబంధ రంగాల కార్యకలాపాలు జోరందుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది.  
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో అబార్షన్ కిట్ల అక్రమ విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అత్యంత అరుదైన వైద్య కేసు వెలుగు చూసింది.
ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్ తన కుమార్తె కళ్యాణి ప్రేమ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ విషయం బయటకు తెలిస్తే గ్రామంలో   కుటుంబ పరువు పోతుందన్న భయంతో  తన కన్నబిడ్డ 18 ఏళ్ల కళ్యాణిని హత్య చేశాడు.  అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని ఇంటిలోని మరో గదిలోకి తీసుకెళ్లి ఉరివేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా  నమ్మించే ప్రయత్నం చేశాడు.  
ఐటీ కారిడార్‌తో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ పరిధిలో పౌర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి శాశ్వత, సమీకృత భవనం అవసరమైంది. పర్యావరణ హితమైన నెట్-జీరో విధానంలో భవనాన్ని నిర్మించడం ద్వారా దీర్ఘకాలంలో నిర్వహణ, ఇంధన వినియోగంపై సానుకూల ప్రభావం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. అయినప్పటికీ భద్రత, తనిఖీల విషయంలో పోలీసులు ఇసుమంతైనా రాజీ పడకుండా వ్యవహరిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి ఉద్యమ గాథ వెనుక ఎన్నో కన్నీళ్లు, ఎన్నో త్యాగాలు దాగి ఉన్నాయి.
తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికత వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తోంది
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది.
అమ్మకు బంగారం కొనివ్వాలనుకున్నాడు.. సైబర్ మోసం బలితీసుకుంది.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.