బిసి అభ్యర్ధికి మాచర్ల కాంగ్రెస్ టిక్కెట్?
Publish Date:Mar 28, 2012
Advertisement
గుంటూరుజిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రయోగాలకు సిద్ధమవుతుంది. బిసి ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి అగ్రవర్ణాలకు బదులు బిసి అభ్యర్ధికి టిక్కెట్ ఇచ్చి అదృష్టం పరీక్షించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నియోజకవర్గంలో 1,97,575 మంది ఓటర్లు ఉండగా వీరిలో బిసి ఓటర్లు 70 వేల మంది, ముస్లిం ఓటర్లు 20వేల వరకూ ఉన్నారు. ఈ గణాంకాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఈసారి బిసి అభ్యర్ధిని రంగంలోకి దింపాలని యోచిస్తోంది. ఇప్పటివరకు మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి లక్ష్మారెడ్డి, కర్రి పున్నారెడ్డిల్లో ఎవరో ఒకరికి టిక్కెట్ లభిస్తుందని భావించారు. అయితే అధిష్టానం ఆలోచన వేరే విధంగా ఉంది. మరోవైపు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ టిక్కెట్ ను తన సన్నిహితులు కె. చెన్నకేశవరావుకు ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగా ఎంపి రాయపాటి సాంబశివరావు తన సన్నిహితుడు గండ్రకోట రాంబాబుకు టిక్కెట్ ఇప్పించాలని ప్రయత్నిస్తున్నారు. వీరికి తోడు మార్కెట్ యార్ట్ చైర్మన్ మద్దిగపు వెంకటరామిరెడ్డి, దివంగత సుందర రామిరెడ్డి తనయుడు మదన మోహన్ రెడ్డి, మున్సిపాల్ మాజీ చైర్మన్ కామనబోయిన కోటయ్య పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/guntur-district-macharla-assembly-constituency-24-12979.html





