ఆ మాజీ ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేస్తున్నదెవరు?
Publish Date:Mar 29, 2012
Advertisement
గుంటూరు జిల్లా గురజాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే కాయితి వెంకటనర్సిరెడ్డిని గత కొద్దిరోజులుగా కొందరు వ్యక్తులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ అజ్ఞాత వ్యక్తులు ఆయనకు ఫోనుచేసి తమకు వెంటనే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని లేకపోతే కుటుంబ సభ్యులకు సంబంధించిన అసభ్యకర ఫోటోలను ఇంటర్నెట్ లో పెట్టడంతోపాటు మీడియాకు కూడా అందజేస్తా మని హెచ్చరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేను బెదిరిస్తున్న వారిలో ఒక మహిళ కూడా ఉంది. ఈ సమాచారాన్ని ఆయన పోలీసులకు కూడా తెలిపారు. పోలీసులు గత రెండు రోజులుగా కేసు దర్యాప్తు చేస్తున్నప్పటికీ పెద్దగా పురోగతి కనిపించలేదు. బ్లాక్ మెయిలర్స్ నిజంగానే డబ్బుకోసం ఇలాంటి పనిచేస్తున్నారా? లేదా ఆకతాయిలు ఎవరైనా ఆటపట్టిస్తున్నారా అన్న విషయం తేల్చుకోలేక నర్శిరెడ్డి సతమతమవుతున్నారు.
http://www.teluguone.com/news/content/guntur-dist-24-12996.html





