షట్లర్ గుత్తా జ్వాల కోచ్ గోపీచంద్ పై ఘాటైన విమర్శలు చేసింది. జాతీయ కోచ్‌గా ఉన్న గోపీచంద్ సొంత ప్రైవేట్ అకాడమీని నిర్వహించడం సరికాదని జ్వాల తప్పుపట్టింది. సొంత ప్రైవేట్ అకాడమీని నిర్వహిస్తున్న వ్యక్తి జాతీయ కోచ్‌గా ఉండడం నైతికంగా సరికాదు. అతను సెలెక్షన్ ప్యానెల్‌లో ఉంటే క్రీడాకారులందరికీ న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించింది. ప్రతిభ ఉన్నవారికి అవకాశం కల్పించాలి. దేశానికి ఒక జ్వాల లేదా సైనా ఉంటే చాలదు. ఎంతోమంది క్రీడాకారులు ఎదగాలి. నేను దూరమైతే అశ్విని, దిజుకు సరైన డబుల్స్ భాగస్వామి లేరు' అని జ్వాల చెప్పింది.
బ్యాడ్మింటన్ ప్రస్తుతం ధనికుల క్రీడగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలని సూచించింది. బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడింది. కోచింగ్ క్యాంప్‌నకు తనను అనుమతించకుండా కోచ్ గోపీ వేధిస్తున్నాడంటూ కోర్టును ఆశ్రయించిన మరో క్రీడాకారిణి ప్రజక్తా సావంత్‌కు జ్వాల మద్దతు తెలిపింది. ప్రజక్తాను క్యాంప్‌లో చేర్చుకోవాల్సిందిగా బాంబే హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gopichand-faces-jwalas-fury-36-18999.html
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో పర్యటించారు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయొద్దన్న కోర్టు ఆదేశాల అమలుపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది.
అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గానే ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు.
మామూలుగా టెన్త్, ఇంటర్ వంటి రిజల్ట్స్ అంటే వార్తా పత్రికల్లో మరుసటి రోజంతా ఆ హడావుడే కనిపిస్తుంది.
శంషాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం దొరక్క.. కుటుంబానికి భారమయ్యానన్న వేదనతో అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు కసరత్తులు వేగవంతమయ్యాయి.