ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారుల నిర్వాకం.. 50 మంది ప్రయాణికులకు నరకయాతన
Publish Date:Jun 20, 2026
Advertisement
హైదరాబాద్ నుంచి రాజ స్థాన్‌కు బయలుదేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు శుక్రవారం (జూన్ 19) రాత్రి సీజ్ చేశారు. బస్సులో ఉన్న సుమారు 50 మంది ప్రయాణికులను కూడా బస్సుతో పాటు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి తీసుకువచ్చారు. అయితే బస్సును సీజ్ చేసిన తర్వాత ప్రయాణికుల గమ్యస్థానానికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులతో సహా ప్రయాణికులందరూ రాత్రంతా సీజ్ చేసిన బస్సులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తినడానికి ఆహారం, తాగునీరు, వాష్‌రూమ్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. దాదాపు 10 గంటలకు పైగా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్దే బస్సులో బందీలుగా ఉండిపోవలసి వచ్చిందని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సును సీజ్ చేసిన తర్వాత ప్రయాణి కుల భద్రత, సంక్షేమం గురించి అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఘటనపై ఆర్టీఏ అధికారులు, సంబంధిత ట్రావెల్స్ సంస్థ స్పందించి, తమకు తక్షణ ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/khairatabad-rta-officials-blunder-36-223615.html





