నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టి రూ. 21 కోట్లకు టోకరా..

Publish Date:Jun 22, 2026

Advertisement

 

హైదరాబాద్‌లో సంచలన గోల్డ్ స్కామ్...

హైదరాబాద్‌లో సినీ కథను తలపించే భారీ గోల్డ్ స్కామ్ వెలుగుచూసింది. మాటలతో మాయ చేసి... నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకుని... ఏకంగా రూ.21 కోట్ల విలువైన 13 కిలోలకు పైగా బంగారు ఆభరణాలను కాజేసిన ఘటన నగరంలో కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం... నితిన్ అనే వ్యక్తి తనకు దేశంలోని ప్రముఖ జువెలరీ షోరూమ్‌లతో సన్నిహిత వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెప్పి పలువురు జువెలరీ వ్యాపారులను నమ్మించాడు. భారీ స్థాయిలో బంగారం కొనుగోలు, విక్రయాలు చేస్తానని, మంచి లాభాలు వస్తాయని హామీ ఇస్తూ వారి విశ్వాసాన్ని సంపాదించాడు.

నితిన్ మాటలను నమ్మిన నవ్య జువెలర్స్, సిద్ధి వినాయక జువెలర్స్, బన్సీలాల్ జువెలర్స్, శ్యాంబాబా జువెలర్స్ యజమానులు విడతల వారీగా అతనికి 13 కిలోలకు పైగా బంగారు ఆభరణాలను అప్పగించారు. వాటి మొత్తం విలువ సుమారు రూ.21 కోట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం తీసుకున్న తర్వాత నితిన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. 

వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన నలుగురు జువెలరీ షోరూం యజమానులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మోసంలో నితిన్ ఒక్కడే కాకుండా అతని భార్య సోదరుడు, మరో నలుగురు కూడా భాగస్వాములయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పక్కా ప్రణాళికతో ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. కోట్ల రూపాయల బంగారం ఎక్కడికి తరలించారు? ఈ ముఠా వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన జువెలరీ వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది.

By
en-us Political News

  
పేదలకు అండగా బసవతారకం ఆసుపత్రి సేవలు..
నల్లగొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా దిల్లీ వేదికగా కీలక అడుగులు పడ్డాయి.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు
రెండేళ్ల చిన్నారి హత్య కేసు ఛేదన.. తల్లి, ప్రియుడి కుట్ర బట్టబయలు...
ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
మా ఆయనే దొరికాడా..ఆయను ఏమైనా అయితే చూస్తూ ఉరుకోము...
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం సాయంత్రం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించి
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పారుపూడి రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు సరికొత్త మలుపు తిరిగింది.
కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే దేశంలో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన రాజీనామాకు దారితీసిన ముఖ్య కారణాలు ఏంటంటే.. గత మే నెలలో జరిగిన బ్రిటన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి స్టార్మర్ నాయకత్వ సామర్థ్యంపై పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తింది.
భారతీయ రైల్వేస్ థర్మల్ ప్లాంట్ల నుండి 340 మిలియన్ టన్నుల ఫ్లై యాష్ (బొగ్గు బూడిద) రవాణా కోసం సరికొత్త మెగా లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తోంది. 40 శాతం డిస్కౌంట్‌తో సిమెంట్, ఇటుకల ధరలను తగ్గించి, వ్యర్థాలను జాతీయ సంపదగా మార్చే ఈ అద్భుతమైన గ్రీన్ ఇనిషియేటివ్ విశేషాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.