గోల్డ్‌స్కీమ్‌ పేరుతో గోల్డ్‌స్కాంలు

Publish Date:Jul 13, 2012

Advertisement

నిన్నటిదాకా డిపాజిట్లు సేకరించిన కొన్ని బ్యాంకుల గురించి, వాటి మోసాల గురించి బాధితుల గోడు తెరకెక్కింది. నేడు బంగారు షాపుల్లో  కొత్తగా గోల్డ్‌స్కీమ్‌ అమలు చేస్తున్నామంటూ వినియోగదారులను మోసం చేస్తున్న సంఘటనలు రాష్ట్రంలో పలుచోట్ల  వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వరంగల్‌ జిల్లాలోని ఏటూరునాగారంలో ఈ తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఒక్కసారి బంగారం కొనలేని వారందరికీ సువర్ణావకాశం అన్న ప్రకటనలు పలువురిని ఆకట్టుకున్నాయి. నెలనెలా కొంతసొమ్మును చెల్లించి చివర్లో దాని విలువైన బంగారాన్ని తీసుకోవచ్చని దుకాణదారులు ప్రకటనలు జారీ చేశారు.



పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవారిని చూసి మథ్యతరగతి వర్తకులూ ఇదే తరహాలో పథకాలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వఉద్యోగులు, చిన్న ఉద్యోగులు  ఈ తరహాపథకాలకు ఆకర్షితులవుతున్నారు. దుకాణదారులు ఏజెంట్లను పెట్టుకుని మరీ ఈ పథకాలు నడుపుతున్నారు. దీంతో ఏజెంట్లు తమ కమిషన్‌ కోసం తమ దుకాణప్రత్యేకతను సెంటిమెంటుతో మిక్స్‌చేసి మరీ చెబుతున్నాడు. ఎప్పుడైతే సెంటిమెంటును ఏజెంటు టచ్‌ చేశాడో వెంటనే ఆ గోల్డ్‌సేవింగ్స్‌ స్కీమ్‌ వినియోగదారునికి నచ్చేస్తోంది. ఇలా బంగారం వర్తకుడు లక్ష్మినారాయణ ఓ కోటిరూపాయలకు పైచిలుకు గోల్డ్‌సేవింగ్స్‌ స్కీమ్‌ పేరిట సేకరించి ఉడాయించారు. దీంతో నెలనెల పొదుపు చేసుకున్న మధ్యతరగతి, పేదలు ఘొల్లుమంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నిందితులు కూడా ఆ మొత్తం డబ్బు పూర్తిగా ఖర్చు అయ్యాక పోలీసులకు చిక్కుతున్నారు.

By
en-us Political News

  
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాసరలోని  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం  ట్రిపుల్ ఐటీ లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో అక్కడ   నీటి ఎద్దడి తీవ్రతరమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, స్థానిక నీటివనరుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది.
తెలంగాణ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
జీవితాంతం కలిసుంటామని మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.
గతంలో హైదరాబాద్ నగరం తక్కువ ధరలో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నివాసాలను అందించే ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇటీవల ప్రైమింగ్ వ్యూహాలు,  విలాసవంతమైన ప్రాజెక్టులపై రియల్టర్లు, బిల్డర్లు అతిగా దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగి.. ఇళ్లు కొనుగోలు అంటేనే సాధారణ, మధ్య తరగతి, వేతన జీవులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రకృతి అందాలను పెంచే మూగజీవాలపై తుపాకీ గురిపెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, శాంతిభద్రతల పటిష్టత దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులు, అసాధారణ వాతావరణ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
1,000 మందికి పైగా టార్గెట్‌.. నిందితుడు అరెస్టు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.