కొత్త గరిష్టాలకు బంగారం ధరలు.. 2027 నాటికి ఔన్సు గోల్డ్ ధర 8వేల డాలర్లు!

Publish Date:Apr 18, 2026

Advertisement

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితి, కరెన్సీల విలువ తగ్గుదల, జియోపొలిటికల్ ఉద్రిక్తతలు కలిసి బంగారం ధరలను చరిత్రలో ఎప్పుడూ లేని గరిష్ఠ స్థాయికి తీసుకెళ్తున్నాయి. అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం వెల్స్ ఫార్గో బ్యాంక్ తాజా  విశ్లేషణలో బంగారం ధర 2027 నాటికి ఔన్స్కు  ఎనిమిది వేల డాలర్లకు చేరే అవకాశం ఉంది.  

 ఇంతకీ డీబేస్మెంట్ ట్రేడ్ అంటే ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ఇన్వెస్టర్లు ఫియాట్ కరెన్సీలను అమ్మి, వాటి స్థానంలో బంగారం వంటి హార్డ్ అసెట్స్ కొనుగోలు చేసే ధోరణినే డీబేస్మెంట్ ట్రేడ్ అంటారు. వెల్స్ ఫార్గో బ్యాంక్  స్ట్రాటజిస్ట్ ఓహ్సంగ్ క్వాన్ ప్రకారం..  ఇది ప్రపంచంలో జరుగుతున్న నాలుగో కరెన్సీ డీబేస్మెంట్ సైకిల్. ఈ సైకిల్ 2022లో ప్రారంభమైంది. సగటు డీబేస్మెంట్ సైకిల్ వ్యవధి ఎనిమిదిన్నర సంవత్సరాలు. ప్రస్తుతం మూడున్నర సంవత్సరాలు మాత్రమే పూర్తి  అయ్యింది. అంటే ఇంకా పెద్ద ర్యాలీ మిగిలే ఉంది 
ఇక బంగారం ధరలు ఎందుకు   వేగంగా పెరుగుతున్నాయంటే?..

 కరెన్సీ విలువ పడిపోవడం.  అమెరికా, యూరప్, చైనా వంటి దేశాల్లో భారీగా డబ్బు ముద్రణ, అప్పులు పెరగడం. ఈ కారణాల వల్లే  కరెన్సీల అసలు విలువ దారుణంగా పడిపోతోంది.  బ్రిడ్జ్వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు రే డాలియో కూడా   బంగారం ర్యాలీకి ప్రధాన కారణం ఫియాట్ కరెన్సీల అసలు విలువ పడిపోవడమే అంటున్నారు. 

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా వడ్డీ రేట్ల పెంపు తర్వాత ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ రిజర్వుల్లో బంగారం వాటాను పెంచుతున్నాయి.  జియోపొలిటికల్ టెన్షన్.. మధ్యప్రాచ్య యుద్ధాలు, అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు, గ్లోబల్ ట్రేడ్ రిస్క్ ఇవన్నీ కూడా ఇన్వెస్టర్లను బంగారం వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. 

వెల్స్ ఫార్గో  ప్రకారం..  ప్రస్తుత బంగారం ఔన్సు ధర 4,800 డాలర్లు.  మోడల్ ప్రకారం ఫెయిర్ వాల్యూ ఔన్స్ కు4,500 డాలర్లు.  బుల్లిష్ కేస్ ప్రకారం ఇది 2027 నాటికి ఔన్స్ బంగారం ధర ఎనిమిది వేల డాలర్లకు చేరుతుంది.  బేరిష్ కేస్ ప్రకారం.. ఆ సమయానికి బంగారం ఔన్సు ధర  4,000 డాలర్లు. 

క్వాన్ పేర్కొన్న గత సైకిల్స్..  గ్రేట్ డిప్రెషన్. 1971లో నిక్సన్ డాలర్ ను బంగారంతో లింక్ నుంచి విడదీయడం, 2000ల యుద్ధాలు, రిసెషన్లు ప్రస్తుత సైకిల్  అంటే 2022 నుంచి ఇప్పటి వరకు.  
దీనితో  ఇన్వెస్టర్లు  బంగారం దీర్ఘకాలికంగా బలమైన హెడ్జ్.  కరెన్సీ విలువ తగ్గుదల, అప్పుల పెరు గుదల, జియోపొలిటికల్ రిస్క్ కారణంగా దీర్ఘకాలిక ఇన్వెస్ట్ మెంట్ కు బంగారం బెటర్ అని భావిస్తున్నారు. 

దీని వల్ల   గోల్డ్ మైనింగ్ స్టాక్స్, ఈటీఎఫ్ లు లాభపడే అవకాశం పుష్కలంగా ఉంది.  బంగారం ధరలు పెరిగితే మైనింగ్ కంపెనీలు, గోల్డ్ ఈటీఎఫ్ లు భారీగా లాభపడతాయి. ఫియాట్ కరెన్సీలపై నమ్మకం తగ్గే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఆధిపత్యంపై ప్రశ్నలు పెరుగుతున్నాయి.
 
ప్రపంచం ప్రస్తుతం ఒక పెద్ద ఆర్థిక మార్పు దశలో ఉంది.  వెల్స్ ఫార్గో బ్యాంక్  అంచనా ప్రకారం, డీబేస్మెంట్ సైకిల్ ఇంకా మధ్య దశలోనే ఉంది. అందువల్ల బంగారం ధరలు రాబోయే సంవత్సరాల్లో మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది.  వెళ్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అంటే ఔన్స్ బంగారం ధర ఎనిమిది వేల డాలర్లకు చేరడానికి ఎక్కువ సమయం పట్టదని అంటున్నారు.  

సంకలనం, సేకరణ: సీతారాం కంఠమనేని
 

By
en-us Political News

  
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే శతకాన్ని బాది రికార్డు సృష్టించాడు. అతనికి తోడుగా ధ్రువ్ జురెల్ అర్ధసెంచరీ 51 పరుగులతో రాణించడంతో రాజస్థాన్ 218 పరుగుల భారీ స్కోరు చేసింది.
అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు ఏపీ మంత్రి నారాయణ శుభవార్త తెలిపారు.
హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశలోకి ప్రవేశించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అద్భుత ఘట్టం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీర్తి కిరీటంతో మరో కలికితు రాయి వచ్చి చేరింది.
మెట్రో సంస్థకు కొత్త చైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతుండగా, తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఊహించని విషాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో మావోయిస్టుల భారీ లొంగుబాటు సంచలనంగా మారింది.
400 అడుగుల బీఎస్ఎన్ఎల్ టవర్‌పై.. 560 రోజులుగా నిరసన.. పంజాబ్‌కు చెందిన పాడి రైతు
రాజేంద్రనగర్ లో విద్యార్థుల ఆందోళన చేస్తూ ఉండడంతో అక్కడ కొంత ఉధృత వాతావరణం నెలకొంది.
ముంబై ఇండియన్స్ అభిమానులకు ఐపీఎల్ వర్గాలు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
మరో వైపు చర్చలలో పాల్గొనేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే అమెరికా ప్రతినిథులతో ముఖాముఖీ చర్చలకు మాత్రం నో చెప్పింది. తాము చెప్పదలచుకున్న విషయాలను పాకిస్థాన్ అధికారుల ద్వారానే అమెరికాకు చేరవేస్తామని.. అంటే పరోక్ష చర్చలకు మాత్రమే తాము సిద్ధమని ఇరాన్ చెప్పకనే చెప్పింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.