సీబీఎన్ కీర్తి కిరీటంలో మరో కలికితు రాయి

Publish Date:Apr 25, 2026

Advertisement

 

ముంబైలో సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు..

ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేసిన ఎకనమిక్ టైమ్స్..
 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీర్తి కిరీటంతో మరో కలికితు రాయి వచ్చి చేరింది. తాజాగా ఆయన ముంబై వేదికగా ప్రతిష్టాత్మకమైన 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకున్నారు. ఆ విజనరీ లీడర్‌కు అవార్డులు కొత్తమీ కాదు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నో ఆయన్ని  వెతుక్కుంటూ వచ్చాయి. పలు ప్రముఖ పత్రికలు ఆయన చేసిన కృషికి అనేక బిరుదులు ఇచ్చాయి. ‘ఐటీ ఇండియన్‌ ఆఫ్‌ ద మిలేనియం’గా, ‘బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’, ‘సౌత్‌ ఏషియన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ వంటి బిరుదులతో సత్కరించాయి. 

అమెరికాకు చెందిన ఒరాకిల్‌ కార్పొరేషన్‌ ప్రచురించే మాసపత్రిక ప్రాఫిట్‌ చంద్రబాబును ‘హిడెన్‌ సెవెన్‌ వర్కింగ్‌ వండర్స్‌’లో ఒకరుగా అభివర్ణించింది. బీబీసీ ‘సైబర్‌ శావీ సీఎం’ అని కొనియాడింది. సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ ‘సీఈఓ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని ప్రశంసించింది. ఇక ఇఫ్పుడు ప్రముఖ ఆర్థిక దినపత్రిక 'ఎకనమిక్ టైమ్స్' సీఎం దార్శనికతకు, పాలనా సంస్కరణలకు గుర్తింపుగా  'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్'  పురస్కారాన్ని ప్రదానం చేసింది.

పరిశ్రమల స్థాపన, మౌలిక సదుపాయాల కల్పన, సులభతర వాణిజ్యంలో చంద్రబాబు చూపుతున్న చొరవను కొనియాడుతూ ఎకనమిక్ టైమ్స్ ఈ అవార్డును అందించింది. దేశ ఆర్థిక అభివృద్ధిలో ఏపీని కీలక భాగస్వామిగా మలిచినందుకు సీఎంకు ఈ గౌరవం దక్కింది. ముంబై పర్యటనలో చంద్రబాబుకు లభించిన ఈ గౌరవం ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణకు మరింత బలాన్ని చేకూర్చనుందని అధికారులు అంటుండటం విశేషం.

By
en-us Political News

  
శరీరం మంట తట్టుకోలేక నీటిలోనే రోజులకు రోజులు ఉంటున్న ముర్షిదాబాద్‌ బాలుడి వింత పరిస్థితి స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఒకప్పుడు మావోయిస్టు లకు కంచుకోటగా, సేఫ్‌ షెల్టర్‌ జోన్‌గా ఉన్న కర్రెగు ట్టలు ఇప్పుడు తెలంగాణ పోలీసుల పటిష్ట భద్రతలోకి వచ్చాయి.
పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో కంటతడి పెట్టిన హరీశ్ రావు..!
మద్యం మత్తులో ఇంజెక్షన్..! విద్యార్థిని ప్రాణాలు తీసిన ఆర్ఎంపీ..!
మద్యం మత్తులో కారు డ్రైవర్ భీభత్సం.. ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి..!
జేపీఎస్సీ పేపర్ లీక్ దుమారం.. విద్యార్థులపై పోలీసుల వాటర్ క్యాన్స్ ప్రయోగం..!
ళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఈ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన పనులలో ఇప్పుడు కదలిక రావడమే కాకుండా వేగం పుంజుకున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయవాడ, విశాఖ రైల్వే ప్రాజెక్టులు రెండూ కలిపి 21వేల 616 కోట్ల భారీ అంచనా వ్యయంతో, 84.63 కిలోమీటర్ల పొడవైన మెట్రో నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది.
మీ స్మార్ట్‌ఫోన్ మరియు డిజిటల్ డేటాను హాకర్లు, డేటా చోరీ నుండి ఎలా రక్షించుకోవచ్చో తెలుసుకోండి. నార్టన్, 1పాస్‌వర్డ్, ప్రొటాన్ మెయిల్ మరియు అథెంటికేటర్ యాప్‌లతో అత్యుత్తమ సైబర్ సెక్యూరిటీ గైడ్.
USB పెన్ డ్రైవ్‌ల వాడకం ఎందుకు తగ్గింది? క్లౌడ్ స్టోరేజ్, స్మార్ట్‌ఫోన్‌లు, వేగవంతమైన SSDలు డేటా నిల్వ ప్రపంచాన్ని ఎలా మార్చేశాయో, పెన్ డ్రైవ్‌ల భవిష్యత్తు ఏమిటో ఈ వెబ్ స్టోరీ ద్వారా తెలుసుకోండి.
రన్నింగ్ అంటే విసుగు చెందే వారికి గూగుల్ జెమిని AI మరియు గార్మిన్ స్మార్ట్‌వాచ్ ఎలా ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయో ఈ కథనంలో తెలుసుకోండి. 14 కిమీ సిటీ2సర్ఫ్ పరుగు కోసం జెమిని అందించిన 3 దశల వర్కౌట్ ప్లాన్, హెల్త్ టిప్స్ మరియు ఫిట్‌నెస్ సీక్రెట్స్ మీ కోసం!
నల్సార్ క్యాంపస్‌లోని  విద్యార్థుల  మాత్రం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను స్నాతకోత్సవానికి ఆహ్వానించడానికి వీల్లేదంటూ వ్యతిరేకిండం కలకలం రేపింది. దాదాపు  వర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్‌ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించవద్దంటూ దాదాపు 450 మంది విద్యార్థులు సంతకాలు చేసిన లేఖను వర్సిటీ వీసీకి సమర్పించారు. 
ఆగస్టు 10 నాటి పసిడి మరియు వెండి రిటైల్ ధరల పూర్తి సమాచారం. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో 24K, 22K బంగారం మరియు కిలో వెండి తాజా రేట్లు, MCX మార్కెట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్ లైవ్ అప్‌డేట్స్: సెన్సెక్స్, నిఫ్టీ పతనం, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్ల కదలికలు, ఐటీ రంగం రికవరీ మరియు ఎస్‌బీఐ క్యూ1 ఫలితాల పూర్తి విశ్లేషణ. గ్లోబల్ మార్కెట్ సంకేతాలు, గిఫ్ట్ నిఫ్టీ స్థాయిలు మరియు ఈ వారం ఇన్వెస్టర్లు పాటించాల్సిన కీలక వ్యూహాలను క్షుణ్ణంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.