మోదీ... బంగారంపై సర్జికల్ స్ట్రైక్స్ కు ప్లాన్ చేస్తున్నారా?
Publish Date:Nov 26, 2016
Advertisement
నోట్ల రద్దు గురించి అక్కడక్కడా మాట్లాడుతూ మోదీ ఏమంటున్నారో జాగ్రత్తగా వింటున్నారా? ఇది అంతం కాదు ఆరంభమే అంటున్నారు! ఇంతకీ ఆయన ఉద్దేశం ఏంటి? నల్లదనం పై ఉక్కుపాదం మోపటానికి మోదీ గట్టి నిర్ణయంతో వున్నారు. అయితే, 500, 1000 నోట్ల బ్యాన్ కేవలం మొదటిది మాత్రమే. మరి తరువాత ఏం చేయనున్నారు? చాలానే వున్నాయి. స్విట్జర్లాండ్ దగ్గర నుంచి మనోళ్ల విదేశీ ఖాతాల్లోని నల్లధనం లెక్కలు తెప్పించటం, ఇన్ కమ్ ట్యాక్స్ ఎత్తేయటం ... ఇలాంటి బోలెడు ఆశ్చర్యకరమైన, సాహసోసేతమైన నిర్ణయాలు వుంటాయట! అయితే, ఇవేవీ ఇప్పుడే పక్కగా చెప్పటం లేదు. కాని, మిడిల్ క్లాస్ వాళ్లకి, ముఖ్యంగా మహిళలకి గుండెలో బాంబులా పేలే ఒక ఆలోచన మాత్రం మోదీ చేస్తున్నారట...
భారతీయ మహిళలు అనగానే ఠక్కున బంగారం కూడా గుర్తొచ్చేస్తుంది! అంతగా బంగారాన్ని ప్రేమిస్తారు మన లేడీస్. కాబట్టే దేశంలో ప్రతీ ఇంట్లో ఎంతో కొంత బంగారం భద్రంగా వుంటూనే వస్తోంది తరతరాలుగా! ఇప్పుడు ఆ గోల్డ్ మీద కన్నేసిందట కేంద్ర ప్రభుత్వం! ఎలాగైతే లెక్కా పత్రం లేకుండా డబ్బు ఇంట్లో దాచేస్తే నేరమవుతుందో... ఇక మీద అలానే బంగారం దాచినా క్రైం అవ్వొచ్చంటున్నారు ఢిల్లీ జనం. ప్రస్తుతానికి ఈ వార్తలపై పెద్దగా క్లారిటీ లేకున్నా త్వరలో ఏ క్షణంలో అయినా బంగారం బాంబు పేలవచ్చంటున్నారు!
నోట్లు రద్దు చేసి నల్లధనం వెలికి తీద్దామని మోదీ ప్రయత్నిస్తే కొందరు బ్లాక్ బాబులు తెలివిగా బంగారం కొనేశారట. పాత 500, 1000 నోట్లు పెట్టి కిలోల కొద్దీ బంగారం కొన్న సదరు గోల్లెన్ రాజాలు మరోసారి సేఫ్ అయ్యారు. కాని, వాళ్లను ఎలాగైన పట్టుకోవాలని పట్టుదలతో వున్న మోదీ మొన్న జరిగిన క్యాబినేట్ సమావేశంలో బంగారంపై అంక్షల గురించి చర్చించారంటున్నారు. దేశంలోని ప్రతీ ఒక్కరూ తమ వద్ద వున్న బంగారం పై స్వచ్ఛందంగా డిక్లరేషన్ ఇచ్చేలా రూల్స్ తేవాలని భావించారట. ఇది ఇప్పటికిప్పుడు జరిగే ఛాన్స్ లేకున్నా ముందు ముందు ఐటీ రిటర్న్స్ లా బంగారం గురించి కూడా ప్రభుత్వానికి చెప్పేయాలన్నమాట. అప్పుడు ఒక్కొక్కరు ఇంకా ఎంత బంగారం కొనవచ్చు అన్నది కేంద్రం నిర్ణయిస్తుంది. సో... భవిష్యత్ లో మనం బంగారం కొనాలంటే ప్రభుత్వం విధించిన లిమిట్ కి లోబడే ఖరీదు చేయాలన్నమాట. అంతకన్నా ఎక్కువ చేస్తే... బ్లాక్ మనీలాగే బ్లాక్ బంగారం అయిపోతుంది! అది చట్ట విరుద్ధం...
దేశంలోని మహిళలందరూ ఇబ్బంది పడేలా బంగారం కొనుగోళ్లపై మోదీ సర్కార్ లిమిట్ విధిస్తుందా? అలా చేసి వారి ఆగ్రహానికి గురవ్వటానికి సిద్ధపడుతుందా? ఇప్పటికైతే అలాంటి పెను సాహసం ఏం చేయబోవటం లేదని కేంద్ర ఆర్దిక శాఖ క్లియర్ గా చెప్పేసింది. కాని, భవిష్యత్ లో జరగదని గ్యారేంటి ఏం లేదు. ఎందుకంటే, బంగారం కొనుగోళ్ల నియంత్రణ వల్లే దేశ ఆర్దిక వ్యవస్థకి చాలా మేలు జరిగే అవకాశం వుంది. అందరికందరూ తులాల కొద్దీ బంగారం కొని డబ్బులు బ్లాక్ చేసి లాకర్లలో బందిస్తే.... మార్కెట్ లో తగినంత ఫండ్స్ వుండవు. అంతే కాదు బంగారం మీదే రూపాయి విలువ కూడా ఆధారపడి వుంటుంది. ఇలాంటి ఎన్నో లాభాల కారణంగా మోదీ బంగారం బాంబు కూడా పేల్చే అవకాశం లేకపోలేదు!
http://www.teluguone.com/news/content/gold-holdings-45-69537.html





